News April 10, 2025

రియాన్ పరాగ్ ఔటా? నాటౌటా?

image

GTతో మ్యాచులో RR బ్యాటర్ పరాగ్ దురదృష్టకర రీతిలో ఔటయ్యారు. ఖేజ్రోలియా వేసిన బంతిని పరాగ్ ఆడేందుకు ప్రయత్నించగా బాల్ వెళ్లి కీపర్ చేతిలో పడింది. అంపైర్ ఔట్ ఇవ్వగా, పరాగ్ రివ్యూ తీసుకున్నారు. బ్యాట్ నేలను తాకిన సమయంలోనే బ్యాటుకు బాల్ క్లోజ్‌గా కనిపించింది. స్పైక్ రావడంతో థర్డ్ అంపైర్ ఔటిచ్చారు. అయితే ఇది నాటౌట్ అని, స్పైక్ వచ్చినప్పుడు బాల్ నీడ బ్యాటుపై కనిపిస్తోందని RR ఫ్యాన్స్ అంటున్నారు.

Similar News

News September 14, 2025

అందుకే.. సాయంత్రం ఈ పనులు చేయొద్దంటారు!

image

సూర్యాస్తమయం తర్వాత వచ్చే సుమారు 45 నిమిషాల కాలాన్ని అసుర సంధ్య వేళ, గోధూళి వేళ అని అంటారు. ఈ సమయంలో శివుడు, పార్వతీ సమేతంగా తాండవం చేస్తాడని నమ్ముతారు. శివతాండవ వీక్షణానందంతో అసుర శక్తులు విజృంభించి జనులను బాధిస్తాయి. ఈ వేళలో ఆకలి, నిద్ర, బద్ధకం వంటి కోరికలు కలుగుతాయి. వీటికి లోనైతే ప్రతికూల ఫలితాలు ఉంటాయి. అందుకే ఈ వేళలో నిద్రపోవడం, తినడం, సంభోగం వంటి పనులు చేయొద్దని పెద్దలు చెబుతుంటారు.

News September 14, 2025

‘నానో బనానా’ మాయలో పడుతున్నారా?

image

‘నానో బనానా’ మాయలో పడి వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్‌లో షేర్ చేయొద్దని TGSRTC MD సజ్జనార్ సూచించారు. ఒక్క క్లిక్‌తో బ్యాంకు ఖాతాల్లోని డబ్బంతా నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుందని ట్వీట్ చేశారు. ‘ట్రెండింగ్స్‌ల్లో మీ ఆనందాన్ని పంచుకోవచ్చు. కానీ భద్రతే తొలి ప్రాధాన్యమనే విషయం గుర్తుంచుకోవాలి. ఫేక్ సైట్లలో పర్సనల్ డేటా అప్లోడ్ చేసేముందు ఆలోచించాలి. మీ డేటా.. మీ డబ్బు.. మీ బాధ్యత’ అని తెలిపారు.

News September 14, 2025

తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్ సోనారిక

image

టాలీవుడ్ హీరోయిన్ సోనారిక శుభవార్త చెప్పారు. తాను తల్లిని కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలు SMలో షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా సోనారిక తెలుగులో జాదుగాడు, స్పీడున్నోడు, ఈడోరకం ఆడోరకం సినిమాల్లో నటించారు. 2022లో తన ప్రియుడు, వ్యాపారవేత్త వికాస్ పరశా‌ర్‌తో ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వారు పెళ్లి చేసుకున్నారు.