News September 5, 2025
సారా టెండూల్కర్ ఎంగేజ్‌మెంట్ అయ్యిందా?

సచిన్ కూతురు సారా ఎంగేజ్మెంట్ వార్తలు బీటౌన్‌లో వైరల్ అవుతున్నాయి. గోవా రెస్టారెంట్ ఓనర్ సిద్ధార్థ్ కేర్కర్‌తో సారా చనువుగా ఉన్న ఫొటోలు బయటికి వచ్చాయి. దీంతో వీరిద్దరి నిశ్చితార్థం అయ్యిందా? అని సందేహిస్తూ పలు న్యూస్ సైట్లు వార్తలు ప్రచురించాయి. గతంలో వీరు గోవాలో దిగిన ఫొటోలనూ షేర్ చేశాయి. దీనిపై సచిన్ ఫ్యామిలీ స్పందించాల్సి ఉంది. సచిన్ కొడుకు అర్జున్‌కు ఇటీవల ఎంగేజ్మెంట్ అయిన విషయం తెలిసిందే.
Similar News
News September 5, 2025
అందుకే VRO, VRAలను BRS తొలగించింది: CM రేవంత్

TG: ధరణి పేరిట ధన, భూదాహంతో BRS ప్రభుత్వం భూములన్నీ చెరబట్టిందని CM రేవంత్ విమర్శించారు. తమ దుర్మార్గాలు ప్రజలకు తెలియకూడదనే VRO, VRAలను తొలగించారన్నారు. ఎన్నికల ముందు ఎవరిని కదిలించినా ధరణి గురించే చెప్పేవారని, అందుకే దాన్ని బంగాళాఖాతంలో పడేస్తామన్న హామీని నెరవేర్చినట్లు చెప్పారు. ధరణితో పట్టుకున్న దరిద్రాన్ని భూభారతితో తొలగిస్తున్నామని GPO నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో అన్నారు.
News September 5, 2025
70 కేసులు వేసినా డీఎస్సీ ఆగలేదు: లోకేశ్

AP: ఇప్పుడున్న ఉపాధ్యాయుల్లో దాదాపు 80% మందిని CM చంద్రబాబే నియమించి ఉంటారని మంత్రి లోకేశ్ అన్నారు. ‘DSC అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే DSC. 13 DSCల ద్వారా 1.80లక్షల మంది టీచర్లను చంద్రబాబే నియమించారు. 70 కేసులు వేసినా డీఎస్సీ మాత్రం ఆగలేదు. గత ప్రభుత్వంలో విచిత్రమైన పాలన చూశాం. ఉపాధ్యాయులను వైన్ షాపుల ముందు కాపలా పెట్టారు. జీతాలు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి’ అని లోకేశ్ ధ్వజమెత్తారు.
News September 5, 2025
శివకార్తికేయన్ ‘మదరాసి’ రివ్యూ&రేటింగ్

తమిళనాడులోకి గన్ కల్చర్ రాకుండా అడ్డుకునేందుకు హీరో చేసే పోరాటమే ‘మదరాసి’. యాక్షన్ సీన్లు, హీరోయిన్‌తో శివకార్తికేయన్ కెమిస్ట్రీ బాగుంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నతంగా ఉన్నాయి. ఫస్టాఫ్ పర్వాలేదనిపించినా సెకండాఫ్‌లో డైరెక్టర్ మురగదాస్ దారి తప్పారు. కథను కొత్తగా చెప్పడంలో సక్సెస్ కాలేకపోయారు. ఊహించే సీన్లు, సాగదీత విసుగు తెప్పిస్తాయి. అనిరుధ్ మ్యూజిక్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.
రేటింగ్: 2.25/5