News October 4, 2025

షమీ కెరీర్ ముగిసినట్లేనా?

image

ఇండియన్ పేసర్ షమీ ఆస్ట్రేలియా సిరీస్‌కూ ఎంపికవ్వకపోవడంతో అతడి కెరీర్ ముగిసిందా? అనే సందేహాలు మొదలయ్యాయి. ముఖ్యంగా గాయాలు కంబ్యాక్‌ను అడ్డుకుంటున్నాయి. ఇప్పుడున్న పోటీకి తోడు 6 నెలలుగా ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడకపోవడం షమీ కెరీర్‌ ప్రమాదంలో పడేలా ఉంది. పైగా వ్యక్తిగత సమస్యలు కూడా అతడు తిరిగి పుంజుకోవడానికి అడ్డంకిగా మారాయని విశ్లేషకులు అంటున్నారు. షమీ 64 టెస్టులు, 108 వన్డేలు, 25 T20లు ఆడారు.

Similar News

News October 4, 2025

పెట్రోల్ కొట్టిస్తున్నారా?.. ఇలా జరిగితే అంతే!

image

ప్రస్తుతం కేంద్రం తీసుకొచ్చిన E20 పెట్రోల్ చాలా బంకుల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ పెట్రోల్ వాడే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా బంక్ యాజమాన్యాలు అవగాహన కల్పిస్తున్నాయి. ‘ఇథనాల్ నీటిని వేగంగా ఆకర్షిస్తుంది. వాషింగ్ & వర్షాల సమయంలో ట్యాంకులోకి నీరు చేరకుండా చూసుకోవాలి. నీరు తగిలితే ట్యాంకులో ఓ ప్రత్యేకమైన పొర ఏర్పడి వాహనం స్టార్ట్ కావడం కష్టతరమవుతుంది’ అని హెచ్చరిస్తున్నారు.

News October 4, 2025

స్థానిక ఎన్నికలపై SEC కాల్ సెంటర్

image

TG: స్థానిక ఎన్నికలకు రెడీగా ఉన్నామని కోర్టుకు నివేదించినందున SEC తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. BC రిజర్వేషన్లపై ఓవైపు హైకోర్టులో కేసు నడుస్తోంది. సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలైంది. అయితే ఎన్నికలకు అనుమతిస్తే అప్పటికప్పుడు ఏర్పాట్లు కష్టమవుతుందనే కొన్ని ముందస్తు చర్యలకు సిద్ధమవుతోంది. ఎన్నికల సమాచారం, ఫిర్యాదులు స్వీకరించేందుకు 92400 21456 నంబర్‌తో తాజాగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది.

News October 4, 2025

వెస్టిండీస్.. ఇదేం ఆట!

image

ఒకప్పుడు వెస్టిండీస్ జట్టంటే విధ్వంసకర బ్యాటర్లు, నిప్పులు చెరిగే బౌలర్లతో నిండి ఉండేది. ఇప్పుడు కనీసం పోటీ ఇవ్వలేని దీనస్థితికి దిగజారింది. భారత్‌తో తొలి టెస్టులో కనీసం 2 రోజులు కూడా నిలబడలేకపోయింది. నిలకడ లేని ఆటగాళ్లున్న WIకు టెస్టులు సెట్ కావడం లేదు. ఒకవేళ ఆడించినా IND, AUS, ENG, NZ, SAతో కాకుండా చిన్న దేశాలతోనే సిరీస్‌లు నిర్వహించాలని క్రికెట్ అభిమానులు సూచిస్తున్నారు. మీ కామెంట్?