News May 26, 2024
బంగ్లా ఎంపీ హత్యకు స్మగ్లింగే కారణమా?

కోల్‌కతాలో బంగ్లా MP అన్వరుల్ అజీమ్ అనర్ హత్య వెనుక బంగారం స్మగ్లింగ్ కారణమై ఉంటుందని ఢాకా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే విషయాన్ని రిమాండ్ రిపోర్ట్‌లోనూ పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అఖ్తరుజ్జమాన్ షాహిన్‌తో MPకి స్నేహం, వ్యాపార సంబంధాలు ఉన్నాయి. వీరిద్దరూ కలిసి దుబాయ్ నుంచి బంగారం స్మగ్లింగ్ చేసేవారు. ఇటీవల వారిద్దరి మధ్య తీవ్ర విబేధాలు రావడంతో MP హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు.
Similar News
News October 21, 2025
సరిహద్దుల్లో 120 మంది టెర్రరిస్టులు?.. ఆర్మీ హైఅలర్ట్

జమ్మూకశ్మీర్‌లో LoC వెంబడి ఇండియన్ ఆర్మీ హైఅలర్ట్ ప్రకటించింది. పాక్ దళాలు, జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద గ్రూపుల కార్యకలాపాలు పెరిగినట్లుగా గుర్తించింది. 120 మంది సాయుధ ఉగ్రవాదులు ఎల్వోసీ వెంబడి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని మల్టీ ఏజెన్సీల ద్వారా ఇన్‌పుట్స్ అందినట్లు సమాచారం. దీపావళి నేపథ్యంలో తాము పూర్తి అలర్ట్‌గా ఉన్నామని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటామని ఆర్మీ వర్గాలు తెలిపాయి.
News October 21, 2025
155% టారిఫ్స్ విధిస్తా.. చైనాకు ట్రంప్ వార్నింగ్

చైనాపై 155% సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ‘సుంకాల రూపంలో చైనా నుంచి మనకు అపారమైన డబ్బు వస్తోంది. ప్రస్తుతం 55% చెల్లిస్తోంది. మనతో ఒప్పందం కుదుర్చుకోకపోతే నవంబర్ 1 నుంచి 155% చెల్లించాల్సి రావచ్చు’ అని హెచ్చరించారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్‌తో ద్వైపాక్షిక చర్చలకు ముందు ఆయన మాట్లాడారు. చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్‌ను సౌత్ కొరియాలో కలవనున్నట్లు వెల్లడించారు.
News October 21, 2025
వరుసగా 4 వికెట్లు.. ఉత్కంఠ పోరులో శ్రీలంక విజయం

ఉమెన్స్ వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో శ్రీలంక 7 రన్స్ తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్‌కు గెలిచే అవకాశం ఉన్నా చివర్లో 2 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా, తొలి 4 బంతుల్లో వరుసగా 4 వికెట్లు పడ్డాయి. దీంతో SLకు ఊహించని విజయం దక్కింది. అంతకుముందు శ్రీలంక 202 పరుగులకు ఆలౌటైంది. ఈ ఓటమితో WC నుంచి ఎలిమినేట్ అయిన తొలి జట్టుగా BAN నిలిచింది.


