News February 8, 2025
కేజ్రీవాల్‌పై స్వాతి కోపమే శాపమైందా?

ఆప్ రాజ్యసభ ఎంపీ <<15398600>>ట్వీట్‌తో<<>> సొంత పార్టీతో తనకు విభేదాలేంటనే చర్చ జరుగుతోంది. గతేడాది CMఆఫీస్‌లో కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు తనపై దాడి చేశాడని స్వాతి ఆరోపించారు. ఈ ఘటనపై కేజ్రీవాల్ చర్యలు తీసుకోకపోగా కనీసం ఖండించలేదు. దీంతో ఆప్‌కు వ్యతిరేకంగా మారారు. ఢిల్లీలోని సమస్యలను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసారు, యమునా నీటిసమస్యపై కేజ్రీవాల్ ఇంటికి ర్యాలీగా వెళ్లి ప్రభుత్వ వైఫల్యాన్నిఎండగట్టారు.
Similar News
News March 8, 2026
చమురు ఉత్పత్తిని నిలిపేసిన మరో దేశం!

చమురు ఉత్పత్తి, ఎగుమతులను నిలిపేస్తున్నట్లు కువైట్ ప్రకటించింది. ఇరాన్ దాడులు, హార్ముజ్ జలసంధి మూతతో ఈ నిర్ణయం తీసుకుంది. పరిస్థితులు అనుకూలించాక ప్రొడక్షన్ తిరిగి ప్రారంభిస్తామని తెలిపింది. OPECలో 5వ అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తిదారు కువైట్. సగటున రోజుకు 2.6M బ్యారెళ్లు ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటికే ఖతర్, ఇరాక్ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నాయి. UAE కూడా క్రూడాయిల్ ప్రొడక్షన్ కట్ చేస్తున్నట్లు తెలిపింది.
News March 8, 2026
ఫైనల్ మ్యాచ్ క్రేజ్.. ధరలు భారీగా పెంచేశారు!

భారత్, NZ మధ్య నేడు T20WC ఫైనల్ జరగనున్న నేపథ్యంలో అహ్మదాబాద్‌లో హోటల్ రూముల ధరలు కొండెక్కాయి. లగ్జరీని బట్టి ఒక్క రాత్రి బసకు రూ.18 వేల నుంచి రూ.80వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇక పలు ఎయిర్‌లైన్స్ ప్రధాన నగరాల నుంచి అహ్మదాబాద్‌కు ప్రత్యేక సర్వీసులు నడుపుతుండగా వాటి ధరలకూ రెక్కలొచ్చాయి. ఇక స్టేడియంలోని లక్షా 30వేల టికెట్లు అమ్ముడుపోగా, 15వేల మంది పోలీసులు స్టేడియం వద్ద భద్రత కల్పిస్తున్నారు.
News March 8, 2026
KCR ఫొటో లేకుండానే రాజకీయాలు: కవిత

TG: మరో రెండుమూడు నెలల్లో పార్టీ పెట్టనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. BRSలోకి మళ్లీ వెళ్లేది లేదని స్పష్టం చేశారు. KCR ఫొటో లేకుండానే రాజకీయాలు చేస్తామని ఆమె ప్రకటించారు. తన వల్లే బీఆర్ఎస్ ఓడిందనే ఆరోపణలపైనా ఆమె ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. తాను జైలుకెళ్లాక పార్లమెంట్ ఎన్నికల్లో BRS ఓడిపోవడం నిజమైతే.. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడారని ప్రశ్నించారు.


