News April 13, 2025

ఆ చిన్నారి డ్రింక్స్‌కే పరిమితమా?

image

మరికాసేపట్లో RCBతో RR తలపడనుంది. ఈ క్రమంలో పదమూడేళ్ల వైభవ్ సూర్యవంశీ(RR)కి తుది జట్టులో స్థానం దక్కుతుందా అనేదానిపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఆయన నెట్స్‌లో తీవ్రంగా సాధన చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఆయనకు ఒక ఛాన్స్ ఇవ్వాలని క్రికెట్ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. వైభవ్‌తో డ్రింక్స్ మోయించడమే కాకుండా మ్యాచులో ఆడించాలని కోరుతున్నారు.

Similar News

News April 15, 2025

IPL: నేడు పంజాబ్, కోల్‌కతా మధ్య పోరు

image

IPLలో ఇవాళ PBKS, KKR తలపడనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకూ 33 మ్యాచులు జరగ్గా KKR 21, PBKS 12 మ్యాచుల్లో నెగ్గాయి. గత 4 సీజన్లలో అయితే చెరో 4 విజయాలు దక్కించుకున్నాయి. గాయంతో ఫెర్గూసన్ దూరమవడం PBKSకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. మరోవైపు ఆ జట్టు మాక్స్‌వెల్ నుంచి మంచి నాక్ ఆశిస్తోంది. అటు బెస్ట్ AVG, ఎకానమీతో బౌలింగ్ చేస్తున్న KKR స్పిన్నర్లు పంజాబ్‌ బ్యాటర్లను కట్టడి చేసే అవకాశం ఉంది.

News April 15, 2025

నేడు కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశం

image

TG: రాష్ట్ర కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశం ఇవాళ ఉ.11గంటలకు CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు పథకాలతో పాటు భూభారతి, SC వర్గీకరణ, BCలకు 42శాతం రిజర్వేషన్లు వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ప్రజాప్రతినిధులకు CM దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే కొన్ని జిల్లాల్లో నేతల మధ్య నెలకొన్న వివాదాలు, పార్టీ అంతర్గత విషయాలపైనా చర్చించే అవకాశముంది.

News April 15, 2025

ఐక్యరాజ్య సమితిలో ఘనంగా అంబేడ్కర్ జయంతి

image

డా.BR అంబేడ్కర్ జయంతిని భారత ప్రభుత్వం ఐక్యరాజ్య సమితిలో నిర్వహించింది. UN ప్రధాన కార్యాలయం(న్యూయార్క్)లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రపంచ నాయకులు హాజరయ్యారు. భారత్ తరఫున కేంద్ర‌మంత్రి రాందాస్ అథవాలే పాల్గొని అంబేడ్కర్ గొప్పతనాన్ని, ఆయన ఆశయ సాధనకు PM మోదీ చేస్తోన్న కృషిని వివరించారు. మరోవైపు అంబేడ్కర్ సేవలను కొనియాడుతూ న్యూయార్క్ నగరం APR 14ను డా.భీమ్‌రావ్ రామ్‌జీ అంబేడ్కర్ దినోత్సవంగా ప్రకటించింది.

error: Content is protected !!