News August 9, 2024
వైసీపీ లక్ష్యం అదేనా?

APలో మైనారిటీల ప్రాబల్యం ఉన్న 20 చోట్ల గత ఎన్నికల్లో YCP ఓటమిపాలైంది. అయితే వారిని మళ్లీ తనవైపు తిప్పుకోవడానికే వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకించినట్టు తెలుస్తోంది. సీమలోని 17 చోట్ల సహా 20 స్థానాల్లో మైనార్టీలు డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఉన్నారు. వారిని మెప్పించడానికి ఈ బిల్లుపై MIM లేవనెత్తిన అభ్యంతారాలతో ఏకీభవిస్తూ YCP వ్యతిరేకించిందన్నది విశ్లేషకులు అభిప్రాయం.
Similar News
News March 8, 2026
యుద్ధంలోకి వస్తామన్న UK? అవసరం లేదన్న ట్రంప్!

మిడిల్ ఈస్ట్‌కు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లను పంపాలని UK అనుకుంటున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వెల్లడించారు. ‘ఒకప్పుడు మన గొప్ప మిత్ర దేశమైన UK ఎట్టకేలకు మిడిల్ ఈస్ట్‌కు రెండు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లను పంపించాలని తీవ్రంగా ఆలోచిస్తోంది. కానీ మాకు అవి అవసరం లేదు PM స్టార్మర్. మేం ఆల్రెడీ యుద్ధం గెలిచాం. ఇప్పుడు యుద్ధంలో చేరేవారు మాకు అవసరం లేదు’ అని ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్ట్ చేశారు.
News March 8, 2026
7 రోజుల్లో గల్ఫ్ నుంచి భారత్‌కు 52వేల మంది

ప.ఆసియా, గల్ఫ్‌లో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఎయిర్ స్పేస్ పాక్షికంగా తెరుచుకోవడంతో ఎయిర్‌లైన్స్ సంస్థలు కమర్షియల్ ఫ్లైట్స్ నడుపుతున్నాయని, MAR 1 నుంచి 7వ తేదీ మధ్య 52వేల మంది గల్ఫ్ నుంచి INDకి తిరిగొచ్చారని వెల్లడించింది. ఫ్లైట్స్ అందుబాటులో లేని దేశాల్లో ఉన్నవారు ఇన్ఫర్మేషన్ కోసం ఎంబసీ/కన్సులేట్‌ను సంప్రదించాలంది. హెల్ప్ లైన్ <
News March 8, 2026
ఈరోజైనా అభి’షేక్’ చేస్తాడా?

T20 WCలో నిరాశ పరుస్తున్న భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఇవాళ NZతో ఫైనల్లోనైనా చెలరేగి ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఫామ్‌లో ఉన్న శాంసన్‌కు తోడు అభి రాణిస్తే బ్యాటింగ్‌లో INDకి తిరుగుండదు. నిన్న ప్రాక్టీస్ టైమ్‌లో అభితో హెడ్ కోచ్ గంభీర్ 40 నిమిషాలపాటు మాట్లాడినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. కాగా ఈ WCలో ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ 7 ఇన్నింగ్స్‌లలో 89 రన్స్ మాత్రమే చేశారు. ఇందులో 3 డకౌట్లు ఉన్నాయి.


