News April 10, 2025

‘విశ్వంభర’ ఆలస్యం వెనుక అదే కారణం?

image

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట తెరకెక్కిస్తున్న ‘విశ్వంభర’ను ఈ ఏడాది జనవరికే విడుదల చేయాలనుకున్నా దాన్ని తర్వాత వాయిదా వేశారు. మూవీలో ఓ స్పెషల్ సాంగ్‌కి కీరవాణి ఇచ్చిన ట్యూన్ చిరుకు నచ్చకపోవడమే వాయిదా వెనుక కారణమని టాలీవుడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. కీరవాణి కొత్త ట్యూన్ ఇచ్చే పనిలో ఉన్నారని వెల్లడించాయి. ఈ స్పెషల్ సాంగ్‌లో చిరు మాస్ స్టెప్స్ వేయనున్నారని స్పష్టం చేశాయి.

Similar News

News April 18, 2025

IPL: సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే?

image

పేలవ ఆటతీరుతో SRH నిరాశపరుస్తోంది. 7 మ్యాచులు ఆడి కేవలం రెండే గెలవడంతో ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే మిగతా 7 మ్యాచుల్లో కచ్చితంగా 6 గెలవాలి. ఒకవేళ 5 గెలిస్తే నెట్ రన్‌రేట్ మిగతా జట్ల కంటే మెరుగ్గా ఉండాలి. కానీ ప్రస్తుతం కమిన్స్ సేన NRR -1.217గా ఉంది. ఇది పాజిటివ్‌లోకి రావాలంటే భారీ తేడాలతో విజయాలు సాధించాల్సి ఉంటుంది. మరి SRH ప్లేఆఫ్స్‌కు వెళ్తుందా? కామెంట్ చేయండి.

News April 18, 2025

IPL: గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్

image

గాయం కారణంగా ఐపీఎల్-2025కు దూరమైన గ్లెన్ ఫిలిప్స్ స్థానంలో గుజరాత్ టైటాన్స్ మరో ఆటగాడిని తీసుకుంది. శ్రీలంక ఆల్ రౌండర్ దసున్ శనకను రూ.75లక్షలకు జాయిన్ చేసుకోనున్నట్లు ప్రకటించింది. శనక 2023 సీజన్‌లో GTకి 3 మ్యాచులు ఆడి 26 పరుగులు చేశారు. ఆ తర్వాత ఐపీఎల్‌లో అతడికి అవకాశం రాలేదు. మీడియం పేస్‌ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేయగల శనక మిడిలార్డర్‌లో తమకు బలంగా మారతాడని GT యాజమాన్యం భావిస్తోంది.

News April 18, 2025

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు!

image

TG: రాష్ట్రంలో రానున్న 5రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులు వీస్తాయంది. మరోవైపు, మిగతా ప్రాంతాల్లో రాత్రి, పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని పేర్కొంది.

error: Content is protected !!