News September 10, 2024

తోడేళ్ల దాడులకు ఆ వైరసే కారణం?

image

UP బహ్రైచ్‌ జిల్లాలో తోడేళ్ల దాడులు 50 గ్రామాల ప్రజలను వణికిస్తున్నాయి. వాటికి రేబిస్ లేదా కెనైన్ డిస్టెంపర్ వైరస్ సోకడమే ఇలాంటి అసాధారణ పరిస్థితికి కారణమై ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల అవి మనుషులపై భయాన్ని కోల్పోతాయని, విచ్చలవిడిగా కరుస్తాయని పేర్కొంటున్నారు. జంతు నమూనాల సమగ్ర విశ్లేషణ ద్వారానే కచ్చితమైన కారణాన్ని తెలుసుకోవచ్చని ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ చీఫ్ SP యాదవ్ తెలిపారు.

Similar News

News October 27, 2025

పిలవని పేరంటానికి అందుకే వెళ్లొద్దంటారు

image

పిలవని పేరంటానికి వెళ్లడం ఆపదనే తెస్తుందనడానికి సతీదేవి కథే నిదర్శనం. దక్షుడు యాగానికి శివుడిని, సతీదేవిని ఆహ్వానించలేదు. అయినా పుట్టింటిపై మమకారంతో సతీదేవి భర్త శివుడి మాటను కాదని, బలవంతంగా ఆ యాగశాలకు వెళ్లింది. అక్కడ దక్షుడు శివుడిని అవమానించడం చూసి, ఆ అవమానాన్ని భరించలేకపోయింది. యోగాగ్నిలో దేహత్యాగం చేసింది. పిలవని చోటికి వెళ్లడం వల్ల ఎంతటి నష్టం కలుగుతుందో ఈ ఘటన మనకు చెబుతోంది.<<-se>>#Shakthipeetham<<>>

News October 27, 2025

సింగర్ మృతి.. చివరి సినిమాకు భారీ క్రేజ్

image

అస్సామీ సింగర్ జుబీన్ గార్గ్ SEP 19న సింగపూర్‌లో <<17805488>>మృతిచెందిన<<>> సంగతి తెలిసిందే. ఆయన లీడ్ రోల్ నటించి, మ్యూజిక్ అందించిన చివరి సినిమా ‘రోయ్ రోయ్ బినాలే’ OCT 31న విడుదలవుతోంది. టికెట్ బుకింగ్స్ ప్రారంభం కాగా గంటలోనే 15K+ అమ్ముడయ్యాయి. BMSలో ఇప్పటివరకు 98K+ ఇంట్రస్ట్‌లు నమోదయ్యాయి. దీంతో ఇది ₹100CR గ్రాస్ కలెక్షన్స్ సాధించే తొలి అస్సామీ సినిమాగా నిలిచే అవకాశం ఉందని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి.

News October 27, 2025

పథకాలపై నివేదికలు ఇవ్వాలని సీఎం ఆదేశాలు

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తికానున్న సందర్భంగా వివిధ శాఖల పరిధిలో అమలవుతున్న పథకాలపై నివేదికలు ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న హామీల అమలుకు ఎంత ఖర్చవుతుంది, ప్రభుత్వంపై పడే అదనపు ఆర్థిక భారమెంత, నిధులను ఎలా సమకూర్చాలి వంటి అంశాలపై రోడ్‌మ్యాప్ రూపొందించాలని సూచించారు. ఈ నివేదికల ఆధారంగా భవిష్యత్ కార్యాచరణను ప్లాన్ చేసుకోవచ్చని భావిస్తున్నట్లు సమాచారం.