News September 24, 2024
దేవరలో జాన్వీ పాత్ర ఎంటర్ అయ్యేది అప్పుడేనా?

‘దేవర’లో హీరోయిన్ ఎంట్రీ గురించి ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం.. తంగం అనే పాత్రలో జాన్వీ కపూర్ కనిపిస్తారు. సినిమా రన్టైమ్ సుమారు 3 గంటలున్నా ఆమె పాత్ర వచ్చేది ఇంటర్వెల్ తర్వాతేనని సమాచారం. కథ అంతా ప్రధానంగా దేవర పాత్రను ఎస్టాబ్లిష్ చేయడం చుట్టూనే తిరుగుతుందని, సగం సినిమా అయ్యాకే హీరోయిన్ ట్రాక్ మొదలవుతుందని టాక్. ఈ వార్తల్లో ఎంతవరకూ నిజముందో చూడాలి మరి.
Similar News
News December 14, 2025
IPL మినీ ఆక్షన్.. ఈ ప్లేయర్కే అత్యధిక ధర?

ఎల్లుండి జరిగే IPL మినీ ఆక్షన్లో AUS ఆల్రౌండర్ గ్రీన్ అత్యధిక ధర పలకొచ్చని క్రీడా విశ్లేషకులు అంచనా. ఈ వేలానికి ఆయన బ్యాటర్గా రిజిస్టర్ చేసుకోగా, మొదటి సెట్లోనే ఎక్కువ ప్రైస్ రావాలని అలా చేశాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే తన మేనేజర్ పొరపాటున ఆప్షన్ తప్పుగా పెట్టాడని, తాను బౌలింగ్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు గ్రీన్ తెలిపారు. అత్యధిక పర్స్ ఉన్న (₹64.30Cr) KKR ఆయన్ను కొనే ఛాన్సుంది.
News December 14, 2025
రేపు ఢిల్లీకి మంత్రి నారా లోకేశ్

AP: రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖల మంత్రి నారా లోకేశ్ సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్వినీ వైష్ణవ్లతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చించనున్నారు.
News December 14, 2025
వార్డ్రోబ్ ఇలా సర్దేయండి

చాలామంది వార్డ్రోబ్ చూస్తే ఖాళీ లేకుండా ఉంటుంది. కానీ వేసుకోవడానికి బట్టలే లేవంటుంటారు. దీనికి కారణం సరిగ్గా సర్దకపోవడమే అంటున్నారు నిపుణులు. అన్ని దుస్తుల్ని విడివిడిగా సర్దుకోవాలి. రోజూ వాడేవి ఓచోట, ఫంక్షనల్ వేర్ మరో చోట పెట్టాలి. ఫ్యామిలీలో ఎవరి అల్మారా వారికి కేటాయించి సర్దుకోవడంలో భాగం చెయ్యాలి. సరిపడినన్ని అల్మారాలు లేకపోతే వార్డ్రోబ్ బాస్కెట్లు వాడితే వార్డ్రోబ్ నీట్గా కనిపిస్తుంది.


