News July 6, 2025

అకౌంట్లలోకి రూ.2వేలు.. పడేది అప్పుడేనా?

image

PM కిసాన్ సమ్మాన్ నిధి కింద 20వ విడత సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ నెలలోనే ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 18న నిధులు విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈనెల 20న PM మోదీ బిహార్‌లో పర్యటించనున్న నేపథ్యంలో దానికి 2 రోజుల ముందే PM కిసాన్ నిధులు విడుదల చేసే ఛాన్స్ ఉందని జాతీయ మీడియా పేర్కొంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ పథకం కింద ఏటా 3 విడతల్లో ₹6వేలు అందిస్తోన్న సంగతి తెలిసిందే.

Similar News

News July 6, 2025

BJP, TDP, కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు: BRS

image

TG: ప్రజాభవన్ వేదికగా గురుశిష్యులు భేటీ అయి ఏడాదైనా ఆస్తులు-అప్పుల సమస్యలు తీరలేదని BRS ఆరోపించింది. వీరిద్దరి ఫెవికాల్ బంధం తెలంగాణ రైతుల గొంతు కోస్తోందని మండిపడింది. ‘వీరిద్దరి కుట్రలను తెలంగాణ సమాజం ఎప్పుడో పసిగట్టింది. గోదావరి జలాలను పక్క రాష్ట్రానికి దోచిపెడుతున్న రేవంత్‌ను ప్రజలు క్షమించరు. BJP, TDP, కాంగ్రెస్ మూకుమ్మడి కుట్రలకు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు’ అని ఎక్స్‌లో ట్వీట్ చేసింది.

News July 6, 2025

రేపే లాస్ట్.. డిగ్రీ అర్హతతో ఎయిర్‌పోర్టుల్లో ఉద్యోగాలు

image

ఏఏఐ కార్గో లాజిస్టిక్స్& అల్లైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ పద్ధతిలో 166 అసిస్టెంట్ (సెక్యూరిటీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో 60 శాతం మార్కులతో పాసై ఉండాలి. ఇంగ్లిష్, హిందీ, లోకల్ భాషలో రాయడం, చదవడం రావాలి. రేపటిలోగా https//aaiclas.aero/career సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జీతం నెలకు రూ.21,000 నుంచి రూ.22,500 వరకు ఉంటుంది.

News July 6, 2025

త్వరలో డబుల్ సెంచరీ చేస్తా: వైభవ్ సూర్యవంశీ

image

భారత టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తనకు స్ఫూర్తి అని అండర్-19 సంచలనం వైభవ్ సూర్యవంశీ అన్నారు. నిన్న ENG అండర్19 జట్టుపై విధ్వంసకర శతకం బాదిన వైభవ్ త్వరలోనే డబుల్ సెంచరీ చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. జట్టు విజయం కోసం రాణించడం బాగుందని తెలిపారు. ఇప్పటికే ఇంగ్లండ్‌తో ఆడిన నాలుగు వన్డేల్లో వైభవ్ 300+ పరుగులు చేశారు.