News April 7, 2025
ఇంటర్ ఫలితాలు వచ్చేది అప్పుడేనా?

TG: ఈ నెల 24 లేదా 25న ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 10వ తేదీతో జవాబు పత్రాల మూల్యాంకనాన్ని పూర్తి చేసి, ఆ తర్వాతి 2 రోజుల పాటు మార్కుల ఎంట్రీ, మార్కుల జాబితాల ముద్రణ పూర్తి చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్ సెట్‌కంటే ముందే ఫలితాల్ని వెల్లడించాలని ఇంటర్ బోర్డు భావిస్తున్నట్లు సమాచారం.
Similar News
News December 12, 2025
AAIలో ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(<
News December 12, 2025
‘అఖండ-2’ నిర్మాతలు, BMSపై హైకోర్టు ఆగ్రహం

‘అఖండ-2’ నిర్మాతలు, బుక్ మై షో సంస్థపై హైకోర్టు ఆగ్రహించింది. ‘కోర్టు ఉత్తర్వులంటే లెక్క లేదా? పెంచిన ధరలతో టికెట్లు ఎందుకు విక్రయించారు?’ అని ప్రశ్నించింది. తమకు ఉత్తర్వులు అందేలోపే ప్రేక్షకులు టికెట్లు బుక్ చేసుకున్నారని BMS నిర్వాహకులు కోర్టుకు తెలిపారు. అటు ధరల పెంపు GO రద్దుపై ఈ మూవీ నిర్మాతలు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేశారు. దీనిపై కాసేపట్లో విచారణ జరగనుంది.
News December 12, 2025
కోర్టులపై SMలో తప్పుడు విమర్శలు చేస్తే కఠినంగా ఉంటా: CJI

విచారణలో జడ్జిలు చేసే కామెంట్లపై SMలో తప్పుడు విమర్శల పట్ల CJI సూర్యకాంత్ ఆందోళన వ్యక్తపరిచారు. ఇలాంటి వాటిపై కఠినంగా ఉంటానని స్పష్టం చేశారు. ఇరువైపుల వాదనల బలాన్ని గుర్తించేందుకే జడ్జిలు వ్యాఖ్యలు చేస్తారని, అవే తుది నిర్ణయం కాదన్నారు. ట్రయల్ కోర్టు జడ్జి వ్యాఖ్యలు పక్షపాతంతో ఉన్నాయని, తనపై రేప్ కేసును బదిలీ చేయాలని కర్ణాటక EX MP ప్రజ్వల్ వేసిన పిటిషన్ విచారణలో CJI ఈ అంశాలు ప్రస్తావించారు.


