News August 1, 2024
ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేది అప్పుడేనా?

రాష్ట్రాలు SC/ST ఉపవర్గీకరణ చేయవచ్చన్న సుప్రీంకోర్టు <<13751609>>తీర్పు<<>> తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాల భర్తీపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత సానుకూలంగా తీర్పు రావడంతో వెంటనే వర్గీకరణకు ప్రభుత్వాలపై ఆయా కులాలు ఒత్తిడి తేవొచ్చు. ప్రస్తుత నోటిఫికేషన్లకూ కొత్త రిజర్వేషన్లు వర్తింపచేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేసే ఛాన్స్ ఉంది. ఇది ప్రస్తుత, రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్లలో కీలకం కానుంది.
Similar News
News December 24, 2025
‘ఆరావళి’ పర్వతాలపై వివాదం ఎందుకంటే?

ఆరావళి పర్వతాల మైనింగ్‌పై <<18662201>>కేంద్రం<<>> వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. వీటిలో ‘100మీ. లేదా అంతకన్నా ఎత్తున్న వాటినే ఆరావళి పర్వతాలుగా పరిగణిస్తారు’ అని కేంద్రం చెప్పిన నిర్వచనాన్ని SC ఆమోదించింది. కానీ ఇప్పుడే కొత్త మైనింగ్ లీజులు ఇవ్వొద్దని ఆదేశించింది. అయితే 91% పర్వతాలది 100 మీ. కంటే తక్కువ ఎత్తు అని, మైనింగ్ పేరుతో వాటిని తవ్వేయాలనే కేంద్రం ఇలా చేస్తోందని పర్యావరణవేత్తలు, ప్రజలు నిరసనలు తెలిపారు.
News December 24, 2025
PHOTO: కొత్త సర్పంచులతో సీఎం రేవంత్

TG: ఇవాళ సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి కొత్త సర్పంచుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. సర్పంచులను సన్మానించి, గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపించాలని సూచించారు. ఈ సందర్భంగా వారితో రేవంత్ దిగిన ఫొటో ఆకట్టుకుంటోంది.
News December 24, 2025
చైనా గుబులు: AI ఎక్కడ తిరగబడుతుందోనని ఆంక్షలు

AI రేసులో ముందున్నామని ప్రకటిస్తున్న చైనా లోలోపల మాత్రం ఈ అత్యాధునిక టెక్నాలజీ పట్ల ఆందోళనతో ఉన్నట్లు తెలుస్తోంది. స్వతంత్రంగా డేటాను విశ్లేషించి సమాధానాలిస్తున్న చాట్బాట్లు ఎక్కడ తమ కమ్యూనిస్టు ప్రభుత్వ విధానాలపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తాయోనని కంగారు పడుతోందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. AI మోడల్స్ ట్రైనింగ్ దశలోనే ప్రభుత్వ వ్యతిరేక డేటాపై జాగ్రత్తలు తీసుకునేలా మార్గదర్శకాలు జారీ చేసింది.


