News August 12, 2024
కుక్కలు అందుకే కరుస్తున్నాయా?

మనుషులపై కుక్కలు దాడి చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. వాటికి బయట ఆహారం లభించకపోవడం, మనుషుల నుంచి వాటికి ఆదరణ లేకపోవడం దీనికి కారణమని పెటా ఇండియా, నిపుణుల నివేదికలు చెబుతున్నాయి. కనిపించగానే తరిమికొట్టడం వల్ల అవి ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నాయని పేర్కొన్నాయి. వాహనాలు ఢీకొని కుక్క పిల్ల చనిపోతే వాటి తల్లులు అలాంటి వాహనాల్ని శత్రువులుగా భావిస్తాయని, అందుకే కొన్ని సార్లు బైక్స్ వెంట పడతాయని తెలిపాయి.
Similar News
News December 7, 2025
మొలక శాతం(వంద విత్తనాలకు) ఎంత ఉండాలి?

☛ మొక్కజొన్న (సంకర రకాలు)- 90% ☛ శనగ- 85% ☛ వరి, ఉలవలు, మొక్కజొన్న (సూటి రకాలు)- 80% ☛ జొన్న, కంది, పెసర, మినుము, జీలుగ, అలసంద – 75% ☛ ఆముదం, వేరుశనగ, పొద్దుతిరుగుడు, సోయాచిక్కుడు – 70% ☛ పత్తి, బెండ, కాలిఫ్లవర్ – 65% ☛ మిరప, బీర, పుచ్చ, సొరకాయ, పొట్లకాయ, పాలకూర- 60%. 100 విత్తనాలకు పై విధంగా మొలకశాతం ఉంటే ఆ విత్తనాల ద్వారా మంచి దిగుబడులకు అవకాశం ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
News December 7, 2025
శని దోషం ఉన్నట్లు ఎలా గుర్తించాలి?

చేసే పనులకు అడ్డంకులు ఎదురైనా, ప్రతి విషయం ఆలస్యమైనా, ఎంత సంపాదించినా డబ్బు నిలవకపోయినా, మానసిక బాధ, నిరాశ వంటి లక్షణాలు శని దోషానికి సంకేతాలుగా భావించవచ్చు. అలాగే యవ్వనంలోనే జుట్టు రాలడం, కంటి చూపు మందగించడం, వైవాహిక జీవితంలో ప్రేమ, ఆప్యాయత లేకపోవడం, తరచూ గొడవలు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. శని దోషం ఉన్నట్లు నిర్ధారించుకోవడానికి మీ జన్మ తేదీ, సమయం ఆధారంగా జ్యోతిషుడిని సంప్రదించాలి.
News December 7, 2025
రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. ఏం చేస్తారంటే?

TG: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ రేపు, ఎల్లుండి హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో జరగనుంది. రెండు రోజులు వివిధ రకాల సదస్సులు నిర్వహిస్తారు. వీటిలో మంత్రులు, IAS అధికారులు, ఆయా రంగాల నిపుణులు పాల్గొననున్నారు. హెల్త్ కేర్, సెమీ కండక్టర్లు, ఎడ్యుకేషన్, గిగ్ ఎకానమీ, స్పేస్ అండ్ డిఫెన్స్, టూరిజం ఇలా 27 అంశాలపై చర్చిస్తారు. రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు రావొచ్చని అంచనా.


