News March 21, 2024
కేజ్రీవాల్ అరెస్టు అందుకేనా?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఎన్నికల సంఘం ఎలక్టోరల్ బాండ్ల సమగ్ర వివరాలను వెల్లడించడానికి, ఈ అరెస్టుకు సంబంధం ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. బాండ్ల విషయాన్ని మీడియా హైలైట్ చేయకుండా ఉండేందుకే ఢిల్లీ సీఎంను అరెస్టు చేశారని అనుమానిస్తున్నారు. కాగా, బాండ్ల రూపంలో రాజకీయ పార్టీలకు భారీగా విరాళాలు వచ్చాయని మార్చి 14న తెలియగా, మార్చి 15న MLC కవితను అరెస్టు చేశారు.
Similar News
News April 8, 2025
మంచు విష్ణుపై మనోజ్ ఫిర్యాదు

మంచు కుటుంబంలో మరోసారి వివాదం జరిగినట్లు తెలుస్తోంది. తన ఇల్లు ధ్వంసం చేశారని మంచు విష్ణుపై నార్సింగి పీఎస్లో మనోజ్ ఫిర్యాదు చేశారు. తన కూతురు పుట్టినరోజు సందర్భంగా రాజస్థాన్కు వెళ్లిన సమయంలో ఇంటిని ధ్వంసం చేశారని, కారుతో పాటు విలువైన వస్తువులను దొంగిలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన తండ్రి మోహన్ బాబుతో మాట్లాడే ప్రయత్నం చేశానని, కానీ ఆయన అందుబాటులోకి రాలేదని చెప్పారు.
News April 8, 2025
రాష్ట్రంలో బార్స్, వైన్స్ మధ్య రగడ

TG: రాష్ట్రంలో మద్యం దుకాణాల మధ్య వివాదం చెలరేగింది. వైన్ షాపులు రాత్రి 11 గంటలకు తెరిచి ఉండటం వల్ల తాము నష్టపోతున్నామని, 10 గంటలకే మూసేలా చర్యలు తీసుకోవాలని బార్ల అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పర్మిట్ రూములనూ మూసేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు తమ వల్లే ప్రభుత్వానికి 85% ఆదాయం వస్తోందని, బార్ల వల్ల 15% మాత్రమే ఆదాయం వస్తోందని వైన్స్ అసోసియేషన్ నాయకులు వాదిస్తున్నారు.
News April 8, 2025
APలో ఇకనుంచి ఒకటే గ్రామీణ బ్యాంకు

APలో ఇకనుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు ఒక్కటే ప్రజలకు సేవలందించనుంది. AP చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఇందులో విలీనం కానున్నాయి. RBI ప్రణాళిక ప్రకారం 43 గ్రామీణ బ్యాంకులను 28కి తగ్గించనున్నారు. ఈ బ్యాంకు ప్రధాన కేంద్రం అమరావతి కాగా, మే1 నుంచి ఈ నిర్ణయం అమలుకానుంది.