News August 15, 2024

క్రైమ్ సీన్‌ నాశనమైందా.. కోల్‌కతా పోలీసుల స్పందన

image

మూకహింసలో ట్రైనీ డాక్టర్ హత్యాచారం క్రైమ్‌సీన్‌కు ఏమీ అవ్వలేదని కోల్‌కతా పోలీసులు తెలిపారు. అసత్యాలను ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘క్రైమ్ సీన్ సెమినార్ హాల్‌లో ఉంది. దాన్నెవరూ ముట్టుకోలేదు’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. నిందితుడిని శిక్షించాలని బెంగాల్ వ్యాప్తంగా గత రాత్రి నుంచి భారీ నిరసనలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో <<13858551>>RG కర్ ఆస్పత్రిలో మూకలు విధ్వంసానికి<<>> పాల్పడ్డాయి.

Similar News

News February 18, 2026

జుట్టు పొడిబారకుండా ఉండాలంటే?

image

పొడిబారి ఉన్న కురులకు గాఢత తక్కువగా, తేమను పెంచే షాంపూలను ఎంచుకోవాలి. పొడి జుట్టు ఉన్నవారు సల్ఫేట్‌ ఫ్రీ ఫార్ములాతో ఉన్న మాయిశ్చరైజింగ్‌ షాంపూలను ఎంచుకోవాలి. తేమను నిలిపే హైలురోనిక్‌ యాసిడ్, స్క్వాలేన్‌ వంటివి ఉండేలా చూసుకోవాలి. తలస్నానం చేశాక కండిషనర్‌ తప్పనిసరిగా రాసుకోవాలి. అయినా సమస్య తగ్గకపోతే డెర్మటాలజిస్ట్‌ని సంప్రదించి పోషకాల లేమి ఏమైనా ఉంటే… సప్లిమెంట్స్‌ వాడాల్సి ఉంటుంది.

News February 18, 2026

బెండలో కాండం తొలిచే పురుగు నివారణ ఎలా?

image

బెండను మొవ్వు, కాయ తొలుచు పురుగు ఆశించడం వల్ల మొక్కలు చనిపోవడంతో పాటు కాయలు పనికిరాకుండా పోతాయి. ఈ పురుగుల నివారణకు కొమ్మలకు రంధ్రం చేసిన ప్రాంతం నుంచి అంగుళం కిందకు తుంచి నాశనం చేయాలి. లీటరు నీటికి ప్రొఫెనోఫాస్ 2ml లేదా క్వినాల్‌ఫాస్ 2ml చొప్పున కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు కాయలు కోసిన తర్వాత పిచికారీ చేయాలి. పంట కాపునకు రాని దశలో లీటరు నీటికి థయోడికార్బ్ 1గ్రా. కలిపి పిచికారీ చేయాలి.

News February 18, 2026

భార్యకు ఎమోషనల్ విషెస్ తెలిపిన మెగాస్టార్

image

‘నా విజయ రహస్యం నీవే’ అంటూ భార్య సురేఖకు మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్‌గా బర్త్ డే విషెస్ తెలియజేశారు. 1980 ఫిబ్రవరి 20న వివాహ బంధంతో మొదలైన తమ ప్రయాణంలో భార్యే తన అతిపెద్ద శక్తి అని కొనియాడారు. ‘కుటుంబ బాధ్యతలన్నీ సురేఖ చూసుకోవడం వల్లే నేను వృత్తిపై దృష్టి పెట్టగలిగా. నా తల్లిదండ్రులకు ఆమె సొంత కూతురిలా నిలిచింది. సంక్షోభంలో, సంతోషంలో అండగా నిలిచిన సురేఖకు హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.