News August 18, 2025

ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం?

image

ఉపరాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు NDA కసరత్తులు చేస్తోంది. ఇదే విషయమై AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇతర పార్టీ నేతలతో BJP నేతలు మాట్లాడుతున్నట్లు సమాచారం. మరోవైపు ఎన్నికల బరిలో నిలవాలని INDI కూటమి ఆలోచనలో ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణను ప్రకటించిన సంగతి తెలిసిందే.

Similar News

News August 18, 2025

GOOD IDEA: నాయకులారా.. మీరూ ఇలా చేయండి!

image

TG: ప్రజా ప్రతినిధులను కలిసేందుకు వచ్చేవారు శాలువాలు, బొకేలను తీసుకొస్తుంటారు. వీటికి బదులు పుస్తకాలు, రగ్గులు తీసుకొస్తే పేదలకు పంచేందుకు ఉపయోగపడుతాయని కొందరు పిలుపునిచ్చారు. అయితే కాస్త కొత్తగా ఆలోచించిన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.. శాలువాలను పిల్లల డ్రెస్సులుగా మార్చారు. ‘Honour to Humanity’ పేరిట పేద పిల్లలకు వీటిని అందించనున్నారు. దీనిని అంతా ఫాలో అవ్వాలని నెటిజన్లు సూచిస్తున్నారు.

News August 18, 2025

కేసీఆర్ వల్లే బీసీ రిజర్వేషన్లు ఆగాయి: రేవంత్

image

TG: కేసీఆర్ 2018లో తెచ్చిన పంచాయతీ రాజ్ చట్టం BC రిజర్వేషన్ల పెంపుకు అడ్డుగా మారిందని సీఎం రేవంత్ అన్నారు. ‘BCలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఆర్డినెన్స్ తెచ్చాం. అది మన గవర్నర్ రాష్ట్రపతికి పంపారు. కేసీఆర్ తెచ్చిన చట్టంలో రిజర్వేషన్లు 50% మించకూడదని ఉంది. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించడంతో దానిపై ఆర్డినెన్స్ తెచ్చాం’ అని తెలిపారు.

News August 18, 2025

యూరియా కోసం కాంగ్రెస్ MPల నిరసన

image

TG: రాష్ట్రంలో యూరియా కొరత నేపథ్యంలో ఢిల్లీలోని పార్లమెంటు భవనం ఎదుట రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు నిరసన చేపట్టారు. తెలంగాణకు రావాల్సిన యూరియాను వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు కేంద్రమంత్రి నడ్డాను కలిసి రాష్ట్రానికి సరిపడా యూరియా కేటాయించాలని వారు కోరనున్నారు. యూరియాపై జీరో అవర్‌లో ప్రస్తావించాలని ఎంపీలు నిర్ణయించారు.