News October 20, 2024

KL కథ ముగిసినట్లేనా? సర్ఫరాజ్ వచ్చేస్తారా?

image

టాలెంటెడ్ ప్లేయర్‌గా ముద్రపడ్డ కేఎల్ రాహుల్ ఇటీవల దారుణంగా విఫలం అవుతున్నారు. నిన్న కీలక సమయంలో రాణిస్తాడని ఆశలు పెట్టుకున్న భారత అభిమానులకు నిరాశే మిగిల్చారు. కేవలం 12 రన్స్ కొట్టి పెవిలియన్ చేరారు. ఇప్పటికే అతడికి టీం మేనేజ్‌మెంట్ చాలా అవకాశాలు ఇచ్చిందని, అతడిని పక్కనబెట్టాల్సిన సమయం వచ్చిందని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. మిడిలార్డర్‌లో సర్ఫరాజ్‌ను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.

Similar News

News February 12, 2026

మహిళల్లో షుగర్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు

image

మహిళల్లో మధుమేహం వచ్చేముందు కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. వాటిని విస్మరించకూడదంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు షుగర్ హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. దీని కారణంగా పీరియడ్స్ గతి తప్పుతాయి. చర్మం ఎర్రగా మారడం, దురద రావడం, జననేంద్రియాలు పొడిబారడంతో పాటు నాడీ వ్యవస్థ దెబ్బతిని చేతులు, కాళ్ళలో జలదరింపు వంటి లక్షణాలుంటాయి. వీటిని గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

News February 12, 2026

విద్యార్థులు ఏమనుకుంటారు.. YCP ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ ఆవేదన

image

AP: నిన్న గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలు సభలో వ్యవహరించిన <<19108172>>తీరుపై<<>> స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు. ‘అసెంబ్లీకి వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు వచ్చారు. సభలో జరిగిన ఆ విధానాన్ని చూసి వారు ఏమనుకుంటారు. ఇంటికెళ్లిన తర్వాత వారు తోటి విద్యార్థులతో ఏం చెబుతారు. గవర్నర్ ప్రసంగించే సమయంలో కాగితాలు చించి విసిరేశారు. అది సరైన పద్ధతేనా’ అని విచారం వ్యక్తం చేశారు.

News February 12, 2026

హగ్ చేసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?

image

*రెగ్యులర్‌గా హగ్ చేసుకోవడం వల్ల బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. గుండె సంబంధిత రిస్కులు తగ్గుతాయి.
*స్ట్రెస్ తగ్గుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
*ఎండార్ఫిన్, ఆక్సిటోసిన్ రిలీజ్ కావడం వల్ల సహజంగా పెయిన్ రిలీఫ్‌గా పని చేస్తుంది.
*పడుకునే ముందు హగ్ చేసుకుంటే వేగంగా నిద్ర పడుతుంది.
**రోజుకు కనీసం 4 సార్లైనా (ఒక హగ్ 20 సెకన్లు) ఆత్మీయులను హగ్ చేసుకోవాలనేది నిపుణుల సూచన
>>ఇవాళ హగ్ డే.