News October 25, 2024

వరంగల్ ఎయిర్‌పోర్టుకు లైన్ క్లియర్?

image

TG: WGL(D) మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అడ్డంకులు తొలగుతున్నాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు 150K.M పరిధిలో 2038 వరకూ వాణిజ్య ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయవద్దనే రూల్‌ను పక్కన పెట్టేందుకు GMR సంస్థ అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలో పనులు పట్టాలెక్కనుండగా, మొత్తం 950 ఎకరాల భూమి అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. 696 ఎకరాల భూమి AAI పరిధిలో అందుబాటులో ఉండగా, 253 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది.

Similar News

News October 25, 2024

INDvsNZ: గిల్ ఔట్

image

గాయం కారణంగా న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఆడలేకపోయిన భారత బ్యాటర్ గిల్ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. 72 బంతులు ఎదుర్కొని 30 పరుగులు చేసి శాంట్నర్ బౌలింగ్‌లో LBW రూపంలో పెవిలియన్ చేరారు. భారత్ ప్రస్తుతం 50/2గా ఉంది. క్రీజులో జైస్వాల్(20), కోహ్లీ(0) క్రీజులో ఉన్నారు. KL.రాహుల్ స్థానంలో గిల్ జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే.

News October 25, 2024

STOCK MARKETS: మార్కెట్లు విలవిల.. ఇన్వెస్టర్లు లబోదిబో

image

దేశీయ స్టాక్ మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. వరుసగా ఐదో సెషన్లోనూ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సిగ్నల్స్ రావడం, జియో పొలిటికల్ సిచ్యువేషన్, US ఎన్నికల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉంటున్నారు. నగదు అట్టిపెట్టుకొనేందుకే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్ 79,701 (-363), నిఫ్టీ 24,277 (-122) వద్ద కొనసాగుతున్నాయి. నిఫ్టీలో INDUSIND BANK 15% క్రాష్ అయింది.

News October 25, 2024

28 నుంచి బీఎస్సీ అగ్రికల్చర్ వెబ్ ఆప్షన్లు

image

AP: అగ్రిసెట్ ద్వారా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు జరగనుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు. ఇటు బీడీఎస్ కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన విద్యార్థులు ఫ్రీ ఎగ్జిట్ గడువు ఇవాళ సాయంత్రం వరకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పొడిగించింది.