News July 30, 2024
తొలి విడతలో రుణమాఫీ కాలేదా?

TG: మొదటి దశ రుణమాఫీపై 1.20 లక్షల ఫిర్యాదుల అందినట్లు వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు తెలిపారు. ఆధార్, బ్యాంక్ ఖాతాలో ఒకే విధంగా పేరు లేకపోవడం, 0 నుంచి స్టార్ట్ అయ్యే బ్యాంక్ అకౌంట్లకు రుణమాఫీ కాలేదన్నారు. RBI వివరాల ప్రకారం ఈ టెక్నికల్ సమస్యలను పరిష్కరించడానికి కొంత సమయం పడుతుందన్నారు. వాటిని సరిచేసి RBI నుంచి నిధులు వెనక్కి రాగానే తిరిగి ఆయా రైతుల అకౌంట్లలో జమ చేస్తామని స్పష్టం చేశారు.
Similar News
News January 28, 2026
VZM: ‘రాజకీయ పార్టీలు బీఎల్‌ఏలను నియమించాలి’

గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీలు తప్పనిసరిగా బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) నియమించుకోవాలని జిల్లా రెవిన్యూ అధికారి ఈ. మురళి సూచించారు. బుధవారం తన ఛాంబర్‌లో రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. బీఎల్‌ఏల ద్వారా ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులు, తొలగింపులు, మరణించిన ఓటర్ల వివరాలు సులభంగా గుర్తించవచ్చన్నారు. జిల్లాలో మొత్తం 15,74,815 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.
News January 28, 2026
ఇందిరమ్మ ఇళ్లు.. లంచం అడిగితే ఈ నంబర్‌కు కాల్ చేయండి!

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ స్పష్టం చేశారు. లబ్ధిదారుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ హౌసింగ్ ఏఈ శ్రీకాంత్‌ను బ్లాక్ లిస్టులో పెట్టామని తెలిపారు. అధికారులు నిరాకరిస్తే ఇళ్ల ఫొటోలు లబ్ధిదారులే యాప్‌లో పెట్టవచ్చని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్‌లో లంచం అడిగితే 1800 599 5991కు కాల్ చేయాలని సూచించారు.
News January 28, 2026
RTC ఉద్యోగులకు గుడ్ న్యూస్

AP: RTCలో పనిచేస్తున్న 4వేల మందికి పైగా ఉద్యోగులకు ప్రమోషన్లు రానున్నాయి. ADC/కంట్రోలర్, లీడింగ్ హెడ్స్‌లకు పదోన్నతి లభిస్తుంది. నిర్ణీత టెస్ట్ పాసైన కండక్టర్లు Jr అసిస్టెంట్లు కానున్నారు. ‘గత OCTలోనే 7500 మందికి ప్రమోషన్‌పై GO వచ్చినా 550 మందికే ఇచ్చారు. దీనిపై లేఖ ఇవ్వగా సీనియార్టీపై క్లారిటీ ఇస్తూ MD ఆదేశాలిచ్చారు. వారంలోపే మిగతా వారికీ పదోన్నతి వస్తుంది’ అని EU నేతలు దామోదర్, నరసయ్య తెలిపారు.


