News October 9, 2025

మహేశ్-రాజమౌళి సినిమా పేరు ‘వారణాసి’?

image

మహేశ్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి పాన్ వరల్డ్ స్థాయిలో ఓ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి ‘వారణాసి’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నవంబర్ 16న టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Similar News

News October 9, 2025

AP న్యూస్

image

☛ రాష్ట్రంలో రహదారుల మరమ్మతులకు రూ.1000 కోట్లు మంజూరు.. జిల్లా రోడ్లకు రూ.600 కోట్లు, రాష్ట్ర రోడ్లకు రూ.400 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
☛ అమరావతిలో రూ.104కోట్లతో క్వాంటమ్ హబ్ భవన నిర్మాణానికి CRDA గ్రీన్ సిగ్నల్
☛ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 15 నుంచి విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె.. 15న చలో విజయవాడ
☛ 2 రోజుల్లో రాష్ట్రంలోని బాణసంచా పరిశ్రమల్లో తనిఖీలు: హోంమంత్రి అనిత

News October 9, 2025

ప్రసారభారతిలో 59 ఉద్యోగాలు

image

ప్రసారభారతి 59పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. యాంకర్ కమ్ కరస్పాండెంట్, కంటెంట్ ఎగ్జిక్యూటివ్, కాపీ ఎడిటర్, కాపీ రైటర్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిగ్రీ, జర్నలిజం, పీజీ డిప్లొమాతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 21వరకు అప్లై చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వీటిని భర్తీ చేయనున్నారు. అభ్యర్థులను పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://prasarbharati.gov.in/

News October 9, 2025

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నేపథ్యం ఇదే

image

TG: నవీన్ యాదవ్ 1983లో జన్మించారు. తండ్రి పేరు చిన శ్రీశైలం యాదవ్. నవీన్ 2014లో MIM, 2018లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2023లో కాంగ్రెస్ పార్టీలో చేరి అజాహరుద్దీన్‌కు మద్దతు ప్రకటించారు. నవ యువ ఫౌండేషన్ స్థాపించి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కుట్టు మిషన్ల పంపిణీ, సామూహిక వివాహాలు, జాబ్ మేళాలు వంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. స్థానికంగా ఈయనకు మంచి పట్టు ఉంది.