News March 31, 2024
వేసవిలో ఫోన్ వేడెక్కుతోందా.. ఈ టిప్స్ పాటించండి!

మొబైల్స్ సాధారణంగా హీటెక్కుతుంటాయి. వేసవిలో మరింత వేడెక్కి ఇబ్బంది కలిగిస్తాయి. అలా కాకూడదంటే ఈ టిప్స్ పాటించండి.
✦ వేసవిలో బయట తిరిగేటప్పుడు ఫోన్‌కు సూర్యకాంతి తగలకుండా జాగ్రత్తపడండి
✦ కంపెనీ ఛార్జర్లు మాత్రమే వాడాలి
✦ బ్లూటూత్, లోకేషన్ సర్వీసెస్ వంటి ఫీచర్లు ఎప్పుడూ ఆన్‌లో ఉంచకూడదు
✦ అనవసరపు యాప్‌లు డిలీట్ చేయాలి
✦ పవర్ సేవ్ మోడ్‌ను ఆన్‌లో పెట్టాలి
✦ ఫోన్ కవర్ ఉపయోగించకపోవడమే మంచిది
Similar News
News January 22, 2026
ఈడీ విచారణకు హాజరైన విజయసాయి రెడ్డి

లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ ఈడీ కార్యాలయంలో ఆయనను అధికారులు విచారిస్తున్నారు. మద్యం సరఫరాదారుల నుంచి వసూలు చేసిన రూ.3,500 కోట్లు దారి మళ్లించినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది.
News January 22, 2026
వంటింటి చిట్కాలు

* సమోసాల తయారీకి ఉపయోగించే పిండిలో కొద్దిగా బియ్యం పిండిని కలిపితే క్రిస్పీగా టేస్టీగా తయారవుతాయి.
* బిర్యానీలోకి ఉల్లిపాయలను వేయించేటపుడు చిటికెడు చక్కెర వేస్తే ఉల్లిపాయ కరకరలాడుతుంది.
* కూరల్లో కారం, ఉప్పు ఎక్కువైనట్లు అనిపిస్తే స్పూన్ శనగపిండి కలపండి చాలు.
* ఓవెన్‌లో బ్రెడ్‌ని కాల్చే సమయంలో.. బ్రెడ్‌తో పాటు చిన్న గిన్నెలో నీరు ఉంచితే.. బ్రెడ్ గట్టిగా అవదు. మంచి రంగులో ఉంటుంది.
News January 22, 2026
గ్రూప్-1 అభ్యర్థుల భవితవ్యంపై తీర్పు వాయిదా

TG: <<17820908>>గ్రూప్-1<<>> అభ్యర్థుల భవితవ్యంపై తీర్పును ఫిబ్రవరి 5కు హైకోర్టు వాయిదా వేసింది. గతంలో మెయిన్స్ ఫలితాలను రద్దు చేసి, తిరిగి మూల్యాంకనం చేయాలని సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. దీనిపై డివిజన్ బెంచ్ స్టే ఇవ్వగా తుదితీర్పునకు లోబడి నియామకాలు ఉండాలని పేర్కొంది. ఇవాళ తీర్పు వెల్లడించాల్సి ఉండగా కాపీ రెడీ కాకపోవడంతో FEB 5న ఇవ్వనున్నట్లు పేర్కొంది.


