News August 4, 2024
ఫోన్ హ్యాంగ్ అవుతోందా? ఇలా చేయండి!

➣స్టోరేజీ ఫుల్ అయితే ఫోన్ హ్యాంగ్ అవుతుంది. అందుకే అవసరం లేని మెసేజ్‌లు, వీడియోలు, ఫొటోలు, యాప్‌లు డిలీట్ చేయండి.
➣యాప్‌లు నిక్షిప్తం చేసుకునే క్యాచీ క్లియర్ చేయాల్సిందే.
➣సాప్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకుంటుంటే ఫోన్ వేగం పెరుగుతుంది.
➣హోం స్క్రీన్‌పై ఉండే విడ్జెట్‌లనూ తొలగించాలి. వైరస్ డిటెక్టింగ్ యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
➣హ్యాంగ్ అవుతున్నప్పుడు రీస్టార్ట్ చేస్తే అప్లికేషన్స్ రీసెట్ అవుతాయి.
Similar News
News March 5, 2026
రోజుకు 5 గంటలే తరగతులు.. మీరేమంటారు?

ఫిన్లాండ్ విద్యా విధానం ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోంది. ఇక్కడ విద్యార్థులు రోజుకు 4 -5 గంటలు మాత్రమే స్కూల్‌లో గడుపుతారు. ప్రతి పీరియడ్ తర్వాత 15 నిమిషాలు విరామం, తక్కువ హోంవర్క్ ఉండటం విశేషం. ఒత్తిడిలేని ఈ వాతావరణం పిల్లల్లో సృజనాత్మకతను, నేర్చుకోవాలనే ఆసక్తిని పెంచుతుందట. అంతర్జాతీయ PISA ర్యాంకింగ్స్‌లోనూ ఫిన్లాండ్ మంచి ఫలితాలు రాబడుతోంది. అక్కడ విద్య, భోజనం, రవాణా ఉచితం. ఈ విధానంపై మీ కామెంట్?
News March 5, 2026
APPLY NOW: NITTTRలో ఉద్యోగాలు

చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (NITTTR)12 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిగ్రీ, డిప్లొమా, టెన్త్ అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 13 వరకు అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్‌కు గరిష్ఠ వయసు 40ఏళ్లు కాగా.. MTS పోస్టుకు 35ఏళ్లు. వెబ్‌సైట్: https://www.nitttrc.ac.in
News March 5, 2026
అప్పుడు YSR-KVP.. ఇప్పుడు రేవంత్-వేం నరేందర్!

TG: సన్నిహితులకు MP పదవుల కేటాయింపులో YSR వ్యూహాన్ని సీఎం రేవంత్ అనుసరించినట్లు కనిపిస్తోంది. 2004లో YSR CM అయిన వెంటనే తన సన్నిహితుడు KVPని ప్రభుత్వ సలహాదారు(రాజకీయ)గా నియమించారు. నాలుగేళ్ల తర్వాత కాంగ్రెస్ హైకమాండ్‌ను ఒప్పించి ఆయనకు రాజ్యసభ సీటు ఇప్పించారు. రేవంత్ కూడా తొలుత వేం నరేందర్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారుగా, ఇప్పుడు రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు.


