News May 4, 2024
పుష్ప-2 నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా?

అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందుతున్న ‘పుష్ప 2: ది రూల్’ నుంచి త్వరలో రెండో పాట రానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. జూన్లో సెకండ్ సింగిల్ను రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేస్తోందట. ఇటీవల విడుదలైన టైటిల్ సాంగ్ సినీప్రియులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇందులో బన్నీ వేసిన స్టెప్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఆగస్టు 15న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
Similar News
News October 27, 2025
తుఫానుగా బలపడ్డ తీవ్ర వాయుగుండం.. అతి భారీ వర్షాలు

నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడిందని APSDMA తెలిపింది. ప్రస్తుతానికి చెన్నైకి 640kms, విశాఖకి 740kms, కాకినాడకి 710kms దూరంలో కేంద్రీకృతం అయిందని పేర్కొంది. రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి, రాత్రికి తీరం దాటొచ్చని అంచనా వేసింది. నేడు కాకినాడ, కోనసీమ, ప.గో, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ-అతిభారీ వర్షాలు పడతాయని వెల్లడించింది.
News October 27, 2025
ఆ గొడ్డు మంచిదైతే ఆ ఊళ్లోనే అమ్ముడుపోను

కొంతమంది సొంతూరిలో తమకు సరైన అవకాశాలు లేవని చెప్పుకుంటూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. అయితే అతనిలో సత్తా ఉంటే సొంత ప్రాంతంలోనే పని లభించేదని ఈ సామెత అర్థం. అయితే ప్రతిభ అనేది ఒకరు ఆపితే ఆగేది కాదని చెప్పే పెద్దలు ఈ జాతీయాన్ని ఉదహరిస్తూ వేరొక చోట ప్రయత్నాలు చేసేవారిని గురించి విమర్శిస్తూ మాట్లాడేటప్పుడు దీన్ని ఉపయోగిస్తారు.
☛ మీకు తెలిసిన వ్యవసాయ సామెతలను కామెంట్ చేయండి.
News October 27, 2025
నారద భక్తి సూత్రాలు – 9

తస్మిన్ అనన్యతా తద్విరోథిషూదాసీనతా చ
భక్తులకు సకల కార్యాలు దైవసేవనే అవుతాయి. మిగితా వాటిని వారు ఉపేక్షిస్తారు. భక్తుల ఇచ్ఛ భగవదిచ్ఛగా మారుతుంది. భక్తుల చిత్తం ఈశ్వరాయత్తమై, దైవీ ప్రేరణతో నడుస్తుంది. భగవంతుడు భక్తులలో ప్రవేశించగానే వారి బుద్ధి దేవునితో అనుసంధానమై, నిరంతరం భగవత్ కళ్యాణ గుణాలను అనుసరిస్తుంది. చిత్తం భగవద్దత్తం కావడం వల్ల ఇంద్రియాలకు భక్తి సోకుతుంది. ప్రపంచంతో బంధం ఉండదు. <<-se>>#NBS<<>>


