News November 28, 2024
‘రాజ్యాంగ పరిరక్షణ’ నినాదం ఓట్లు రాల్చడం లేదా?

‘రాజ్యాంగ పరిరక్షణ’ నినాదం కాంగ్రెస్‌కు ఓట్లు రాల్చడం లేదని విశ్లేషకుల అంచనా. LS ఎన్నికల నుంచి రాహుల్ గాంధీ ‘రాజ్యాంగ పుస్తకం’ చేతబూని పదేపదే రక్షిస్తున్నామని ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయనదిదే ఒరవడి. అయినా JKలో 6, హరియాణాలో 37, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో 16 చొప్పునే సీట్లు వచ్చాయి. ప్రజలు ఆ నినాదాన్ని నమ్మితే ఓటు షేరు, సీట్ల సంఖ్యలో ఎందుకు ప్రతిబింబించడం లేదని ప్రశ్న. మీరేమంటారు?
Similar News
News January 27, 2026
జనవరి 27: చరిత్రలో ఈరోజు

1922: బాలీవుడ్ నటుడు అజిత్ ఖాన్ జననం
1927: తెలుగు కవి, రచయిత పోతుకూచి సాంబశివరావు జననం
1936: కథా, నవలా రచయిత్రి కోడూరి కౌసల్యాదేవి జననం
2009: భారత మాజీ రాష్ట్రపతి రామస్వామి వెంకట్రామన్ మరణం
2023: సినీ నటి జమున మరణం (ఫొటోలో)
* కుటుంబ అక్షరాస్యత దినోత్సవం
News January 27, 2026
పొలిటికల్ వెపన్‌లా సిట్ నోటీసులు: హరీశ్ రావు

TG: రేవంత్ ప్రభుత్వం సిట్ నోటీసుల్ని పొలిటికల్ వెపన్‌లా వాడుతోందని హరీశ్ రావు అన్నారు. కోల్ స్కామ్‌పై ప్రశ్నించడంతో పబ్లిక్ అటెన్షన్‌ను డైవర్ట్ చేసేందుకు తనకు, KTRకు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. ఈ స్కామ్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని BRS నిర్ణయించిన కొన్ని గంటల్లోనే మాజీ ఎంపీ సంతోష్‌కు నోటీసులు వచ్చాయన్నారు. కాగా మంగళవారం గవర్నర్‌ను కలిసి సింగరేణి కుంభకోణంపై వివరాలు ఇవ్వనున్నట్లు BRS తెలిపింది.
News January 27, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి


