News November 10, 2024

షేక్ హసీనా రీఎంట్రీకి రంగం సిద్ధమవుతోందా?

image

బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. షేక్ హసీనా రీఎంట్రీకి రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ట్రంప్‌తో ఆమెకు సయోధ్య ఉండగా యూనస్‌కు విరోధం ఉంది. పైగా అతడిని చీఫ్ అడ్వైజర్‌గా ఎంపికచేసింది డెమోక్రాట్లు, డీప్‌స్టేట్ అన్న ఆరోపణలూ ఉన్నాయి. మొన్న బంగ్లా ఆర్మీ చీఫ్ భారత్‌కు రావడం, యూనస్‌పై ICCలో ఫిర్యాదు, మైనార్టీలు, అవామీ లీగ్-విద్యార్థి ఉద్యమకారుల మధ్య పోటీ నిరసనలతో సందిగ్ధం నెలకొంది.

Similar News

News February 13, 2026

ప్రశ్నించడాన్ని CBN తట్టుకోలేకపోతున్నారు: జగన్

image

AP: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రశ్నించడాన్ని CM CBN తట్టుకోలేకపోతున్నారని YCP అధినేత జగన్ అన్నారు. అందుకే తమ పార్టీ నేతలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. YCP MLAలు, MLCలతో ఆయన భేటీ అయ్యారు. ‘అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వడం లేదు. బలం తక్కువ కావడంతో అక్కడ గొంతెత్తలేం. అందుకే మీడియాతో మాట్లాడుతున్నాం. మండలిలో బలం ఉంది కాబట్టి అవగాహనతో బాగా మాట్లాడాలి’ అని దిశానిర్దేశం చేశారు.

News February 12, 2026

రేపు వైన్ షాపులు బంద్

image

TG: రేపు ఎన్నికల కౌంటింగ్ జరగనున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఉ.6 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ముగిసేవరకూ మద్యం షాపులు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. రేపు ఉ.8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది.

News February 12, 2026

85% చూపు కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్!

image

పాక్ మాజీ PM ఇమ్రాన్ ఖాన్ కంటి చూపు మందగించింది. ఆయన కుడి కన్ను 85% విజన్ కోల్పోయిందని సుప్రీంకోర్టు నియమించిన లాయర్ తెలిపారు. 3 నెలలుగా కంటిచూపు సమస్యతో బాధపడుతున్నా జైలు అధికారులు చికిత్స అందించడం లేదని కోర్టుకు రిపోర్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఆరోగ్యంపై మెడికల్ రివ్యూకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవినీతి ఆరోపణలతో అరెస్టయిన ఇమ్రాన్ 2023 AUG నుంచి జైలులోనే ఉన్నారు.