News March 16, 2025

బంగారం ధర తగ్గే అవకాశం ఉందా?

image

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ధరలు తగ్గుతాయనే విషయమై నిపుణులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ట్రంప్ అనూహ్య నిర్ణయాలు, ఇతర ప్రతికూల పరిస్థితులు ఇలాగే కొనసాగితే తగ్గకపోవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం 3వేల డాలర్లు ఉన్న ఔన్సు ధర 3,040 డాలర్లకు చేరాక అక్కడి నుంచి తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. దీనిపై 1-2 నెలల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

Similar News

News November 19, 2025

త్వరలో ఆధార్ కార్డులో కీలక మార్పులు!

image

ఆధార్ విషయంలో కీలక మార్పులు చేయాలని UIDAI భావిస్తోంది. ఫొటో, QR కోడ్‌తో ఆధార్ కార్డును తీసుకురావడాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వ్యక్తుల డేటా దుర్వినియోగం కాకుండా ఈ దిశగా ఆలోచిస్తోందని తెలిపాయి. కార్డుపై వివరాలు ఎందుకు ఉండాలని, ఫొటో, QR కోడ్ ఉండాలని UIDAI CEO భువనేశ్ కుమార్ అన్నారు. ఆఫ్‌లైన్ వెరిఫికేషన్‌ను నియంత్రించేలా డిసెంబర్‌లో కొత్త రూల్ తీసుకొస్తామని తెలిపారు.

News November 19, 2025

ఇలాంటి వారి దగ్గర లక్ష్మీదేవి ఉండదట

image

మాసిన బట్టలు ధరించి, పరిశుభ్రత పాటించనివారి దగ్గర లక్ష్మీదేవి ఉండదని పండితులు చెబుతున్నారు. అలాగే అమితంగా తినేవారి దగ్గర, బద్ధకంగా ఉండే వ్యక్తులు దగ్గర, కర్ణ కఠోరంగా మాట్లాడేవారి దగ్గర ధనం నిలవదని అంటున్నారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పడుకునేవారు ఎంతటి గొప్పవారైనా వారిని లక్ష్మీదేవి అనుగ్రహించదని తెలుపుతున్నారు. ఒకవేళ వీరి వద్ద సంపద ఉన్నా, అది ఎక్కువ రోజులు నిలవదని పేర్కొంటున్నారు.

News November 19, 2025

భారత్, బంగ్లాదేశ్ సిరీస్ వాయిదా

image

భారత్, బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య డిసెంబర్‌లో జరగాల్సిన సిరీస్‌ను బీసీసీఐ వాయిదా వేసింది. రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బంగ్లాతో సిరీస్‌కు తమకు పర్మిషన్ రాలేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. డిసెంబర్‌లో ప్రత్యామ్నాయ సిరీస్‌కు ఏర్పాట్లు చేస్తామని వెల్లడించాయి. కాగా షెడ్యూల్‌లో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది.