News June 30, 2024

ప్రభుత్వ పరువు తీసే కుట్ర ఉందా?: కేంద్ర మంత్రి

image

బిహార్‌లో వరుసగా <<13531487>>బ్రిడ్జి<<>>లు కూలిన ఘటనపై కేంద్ర మంత్రి జీతన్ రామ్ మాంఝీ మీడియాతో అనుమానాలు వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాతే ఎందుకు ఇలా జరుగుతోందని ఆశ్చర్యపోయారు. రాష్ట్ర ప్రభుత్వ పరువు తీసే కుట్ర ఏమైనా జరుగుతోందా అని ప్రశ్నించారు. ఈ ఘటనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిశితంగా పర్యవేక్షిస్తున్నాయని చెప్పారు. బాధ్యులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

Similar News

News October 27, 2025

‘సర్’లో ఏం చేస్తారు?

image

దేశవ్యాప్తంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR)పై EC నేడు ప్రకటన చేయనుంది. తొలి విడతగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న TN, బెంగాల్, కేరళ, అస్సాం, పాండిచ్చేరిలో నవంబర్ 1 నుంచి ప్రారంభించనుంది. సర్వేలో భాగంగా ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను తనిఖీ చేస్తారు. జాబితా ప్రకారం ఓటర్లు ఆ ఇంట్లో ఉన్నారా? లేరా? అని చెక్ చేస్తారు. నకిలీ ఓట్ల తొలగింపు, తప్పుల సవరణకు ఇది దోహదపడుతుందని EC చెబుతోంది.

News October 27, 2025

గిన్నిస్ రికార్డు.. ప్రపంచంలోనే అతిచిన్న స్పూన్

image

ఒడిశాకు చెందిన బిజయ్ కుమార్ రెడ్డి అనే మినియేచర్ ఆర్టిస్ట్ ప్రపంచంలోనే అతిచిన్న చెక్క స్పూన్ రూపొందించి గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పారు. ఈ స్పూన్ పొడవు 1.13mm. సూది కన్నులోంచి వెళ్లగలిగేంత చిన్నగా ఉంటుంది. దీనిని రూపొందించేందుకు 3 నెలల సమయం పట్టిందని, మైక్రోస్కోప్‌తో చూస్తేనే ఇది కనిపిస్తుందని బిజయ్ తెలిపారు. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు బిహార్‌కు చెందిన వ్యక్తి(1.64mm) పేరిట ఉండేది.

News October 27, 2025

ఏ పంటలకు ఎలాంటి కంచె పంటలతో లాభం?

image

☛ వరి పొలం గట్ల మీద కంచె పంటలుగా బంతి మొక్కలను నాటి నులిపురుగుల ఉద్ధృతిని తగ్గించవచ్చు. ☛ పత్తి చేను చుట్టూ కంచెగా సజ్జ, జొన్న, మొక్కజొన్నను 3-4 వరుసల్లో వేస్తే బయటి పురుగులు రాకుండా ఆపవచ్చు. ☛వేరుశనగలో జొన్న, సజ్జ కంచె పంటలుగా వేస్తే రసం పీల్చే పురుగులు, తిక్కా ఆకుమచ్చ తెగులు ఉద్ధృతి తగ్గుతుంది. ☛ మొక్కజొన్న చుట్టూ 4, 5 వరుసల ఆముదపు మొక్కలను దగ్గరగా వేస్తే అడవి పందుల నుంచి పంటను కాపాడుకోవచ్చు.