News July 8, 2025

రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఉందా?

image

కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ 10 కార్మిక సంఘాలు, అనుబంధ సంఘాల ఐక్యవేదిక రేపు (జులై 9) భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. బ్యాంకింగ్, బీమా, పోస్టల్, విద్యుత్ తదితర రంగాలపై బంద్ ప్రభావం పడే ఛాన్స్ ఉంది. ఇప్పటివరకు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటనలు రాలేదు. ఇవాళ సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశముంది. రవాణా అంతరాయం, నిరసనల కారణంగా కొన్ని స్కూల్స్, కాలేజీల కార్యకలాపాలకు ఆటంకం కలిగే ఆస్కారం ఉంది.

Similar News

News August 15, 2025

TODAY HEADLINES

image

* పులివెందుల, ఒంటిమిట్ట ZPTCలు TDP కైవసం
* ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి: CBN
* దొంగ ఓట్లతో గెలవడమూ ఓ గెలుపేనా: అవినాశ్
* CS పదవీకాలం పొడిగింపు కోసం CM రేవంత్ రిక్వెస్ట్!
* SC తీర్పు ప్రజాస్వామ్య విజయం: మహేశ్ కుమార్
* 3 దశాబ్దాల తర్వాత నచ్చిన వారికి ఓటేశారు: పవన్
* ‘ఆపరేషన్ సిందూర్’ చరిత్రలో నిలిచిపోతుంది: రాష్ట్రపతి
* ఈ నెల 18న శ్రీవారి ఆర్జిత టికెట్ల కోటా రిలీజ్

News August 15, 2025

శనివారం వరకు వేటకు వెళ్లరాదు: APSDMA

image

AP: బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని ఉన్న అల్పపీడనం రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీంతో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. మత్స్యకారులు శనివారం వరకు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. అటు కృష్ణానది వరద ప్రవాహం ఎగువ ప్రాజెక్టులలో స్వల్పంగా తగ్గుముఖం పట్టిందని వివరించింది.

News August 15, 2025

పులివెందులలో వైసీపీకి 8% ఓట్లా?: రోజా

image

AP: గత ఎన్నికల్లో పులివెందుల పరిధిలో YCP 64% ఓట్లు సాధించిందని, ఇప్పుడు 8.95% ఓట్లు రావడమేంటని ఆ పార్టీ నేత రోజా ప్రశ్నించారు. గత ఎన్నికల్లో 24% ఓట్లు వచ్చిన TDPకి ఇప్పుడు 88% ఓట్లు రావడమేంటని మండిపడ్డారు. ‘ఐదుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులకు 0, 1, 2, 3, 4 ఓట్లు రావడం ఏమిటో? పోటీలో ఉన్న అభ్యర్థికి వారి కుటుంబసభ్యులు అయినా ఓటు వేయరా? ఈ ఫలితాలను మనం నమ్మాలా?’ అంటూ ఆమె సందేహం వ్యక్తం చేశారు.