News February 5, 2025
ప్రణబ్ మెమోరియల్ పక్కనే మన్మోహన్ స్మారకానికి స్థలం?

మాజీ PM, దివంగత మన్మోహన్ సింగ్ మెమోరియల్ కోసం కేంద్రం ఢిల్లీలో స్థలాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రాజ్ ఘాట్ కాంప్లెక్స్‌లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్మారకం పక్కనే ల్యాండ్‌ను ఇస్తామని మన్మోహన్ కుటుంబీకులకు తెలిపినట్లు సమాచారం. వారు సమ్మతి తెలపగానే మెమోరియల్ నిర్మాణానికి రూ.25 లక్షలు అందించనున్నట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. గత ఏడాది DEC 26న మన్మోహన్ మరణించిన విషయం తెలిసిందే.
Similar News
News March 31, 2026
తొలిసారి ధోనీ, రైనా లేకుండా..

IPL-2026 సీజన్‌లో నిన్న తొలి మ్యాచ్ ఆడిన CSK రాజస్థాన్ చేతిలో <<19519904>>ఘోర<<>> ఓటమిపాలైంది. అయితే 277 మ్యాచుల తర్వాత ధోనీ, రైనా లేకుండా ఆ జట్టు బరిలోకి దిగడం గమనార్హం. ఇందులో 253 IPL, 24 ఛాంపియన్స్ లీగ్ T20 మ్యాచులున్నాయి. వీటన్నింటిలోనూ ధోనీ లేదా రైనా ఉన్నారు. IPL నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన రైనా, 2021లో చివరి మ్యాచ్ ఆడారు. ఇక <<19508727>>గాయం<<>> కారణంగా ఈ సీజన్‌లో కొన్ని మ్యాచులకు ధోనీ దూరమయ్యారు.
News March 31, 2026
అడుగంటిన నీటి నిల్వలు.. శ్రీశైలంలో నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి

AP: శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు అడుగంటాయి. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 44 TMCల నీరే ఉంది. దీంతో ఇరు రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశాయి. గత పది నెలల్లో కుడి గట్టులో ఏపీ 2060 మిలియన్ యూనిట్లు, ఎడమ గట్టులో TG 2,725 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశాయి. విభజన తర్వాత ఇరు రాష్ట్రాలు ఈ స్థాయిలో ఉత్పత్తి చేయడం ఇదే తొలిసారి. ఉమ్మడి ఏపీలో 2007-08లో 2,544 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి అయింది.
News March 31, 2026
జాగ్రత్త.. పిడుగులతో వర్షాలు, తీవ్ర వడగాల్పులు

APలో ఇవాళ భిన్న వాతావరణం ఉండనుంది. ద్రోణి ప్రభావంతో SKL, అల్లూరి, పోలవరం, KNL, నంద్యాల, VZM, మన్యం, VSKP, నెల్లూరు, ATP జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చని APSDMA తెలిపింది. మన్యం, పోలవరం, విజయనగరం, తూ.గో, ఏలూరు జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. భిన్న వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంది.


