News March 21, 2025

ఔరంగజేబు సమాధిని కూల్చే అవకాశం ఉందా?

image

మహారాష్ట్ర ఖుల్దాబాద్‌లో ఉన్న ఔరంగజేబు సమాధిని కూల్చివేయాలన్న డిమాండ్ నేపథ్యంలో ఆ రాష్ట్ర సర్కార్‌కు దానిని కూల్చే అధికారం ఉందా అనే చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా దీనిని కూల్చే హక్కు రాష్ట్రానికి లేదు. పురాతన స్మారక చిహ్నాలు, ప్రదేశాలు, అవశేషాల చట్టం, 1958 కింద దీనికి ASI రక్షణ కల్పిస్తోంది. ఇటువంటి స్థలాలను చట్టపరమైన ప్రక్రియ ద్వారా డీ-నోటిఫై చేసే హక్కు కేంద్రానికి మాత్రమే ఉంది.

Similar News

News March 28, 2025

టెన్త్ స్టూడెంట్స్‌కు మధ్యాహ్న భోజనం

image

TG: టెన్త్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం అందించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాలే ఎగ్జామ్ సెంటర్ అయి, అందులో గవర్నమెంట్ స్కూళ్ల విద్యార్థులు పరీక్షలు రాస్తుంటే వారికి భోజనం పెట్టి ఇంటికి పంపించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 21న ప్రారంభమైన పరీక్షలు ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్నాయి.

News March 28, 2025

ALERT.. వాకింగ్‌లో ఇలా చేయకండి

image

ఆరోగ్యంగా ఉండేందుకు వాకింగ్(నడక) చేయడం ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. అయితే కొన్ని తప్పులు చేస్తే గుండెపై ప్రభావం పడుతుందని అంటున్నారు. ఈ కింది తప్పులు చేయొద్దని సూచిస్తున్నారు.
* మరీ వేగంగా నడవడం
* వార్మప్ చేయకపోవడం
* వంగి నడవడం
* వాకింగ్ ముందు/తర్వాత నీరు తాగకపోవడం
* అమితంగా తినడం
* కాలుష్య ప్రాంతాల్లో నడవడం
* అతిగా శ్రమించడం

News March 28, 2025

IPL: పాపం కావ్య

image

సీజన్ తొలి మ్యాచ్‌లో 286 రన్స్ చేసి భారీగా అంచనాలు పెంచేసిన SRH రెండో గేమ్‌లో చతికిలపడింది. LSG చేతిలో ఘోరంగా ఓడిపోయింది. దీంతో అభిమానులతో పాటు ఫ్రాంఛైజీ ఓనర్ కావ్యా మారన్ డీలా పడిపోయారు. నిన్న స్టేడియంలో మ్యాచ్ చూస్తూ ఆమె పలికించిన హావభావాల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘పాపం కావ్య పాప’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

error: Content is protected !!