News September 7, 2024
అసలు ప్రభుత్వం ఉందా? లేదా?: జగన్

AP: విజయవాడలో వరద వచ్చి 8 రోజులు గడుస్తున్నా ఇంకా ఆకలికేకలు వినిపిస్తూనే ఉన్నాయని మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘అసలు ప్రభుత్వం అనేది ఉందా? లేదా? అని అనిపిస్తోంది. ఐదారు లక్షల మందిని ఉదారంగా ఆదుకోలేని దీనస్థితిలో ప్రభుత్వం ఉందా? గతంలో చాలా సార్లు 30 సెం.మీ పైగా వర్షం పడినా ఈ మాదిరిగా 50 మందికి పైగా ప్రజలు చనిపోలేదు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్కరోజులోనే రేషన్ సరుకులు పంపిణీ చేశాం’ అని తెలిపారు.
Similar News
News September 3, 2025
లండన్లో కోహ్లీకి ఫిట్నెస్ టెస్ట్స్.. నెటిజన్ల ఫైర్

లండన్లో నిర్వహించిన యోయో, బ్రాంకో టెస్టుల్లో <<17597735>>విరాట్ కోహ్లీ<<>> పాస్ అయ్యారు. ఫిట్నెస్ టెస్ట్ వ్యవహారంలో BCCI ఫేవరిటిజం ప్రదర్శించిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆటగాళ్లందరికీ బెంగళూరులో నిర్వహించి, కోహ్లీకి ఒక్కడికే విదేశాల్లో ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అతడికే ఎందుకు ఈ స్పెషల్ ప్రివిలేజ్ అని నిలదీస్తున్నారు. కాగా కొంతకాలంగా కోహ్లీ లండన్లోనే ఉంటున్నారు.
News September 3, 2025
మా నాన్నపై ఒత్తిడి తెచ్చి నన్ను సస్పెండ్ చేయించారు: కవిత

TG: కేసీఆర్ మీద ఒత్తిడి తెచ్చే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయించారని కవిత అన్నారు. ‘కేసీఆర్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో అడిగేంత ధైర్యం, అనుభవమూ నాకు లేవు. ఆయన నిర్ణయాన్ని శిరసావహిస్తాను. నా లేఖ లీకైందని చెప్పి వంద రోజులైంది. అప్పటి నుంచి పార్టీ నన్ను వివరణ అడగలేదు. గతంలో పార్టీపై విమర్శలు చేసిన రవీందర్ రావు ఇప్పుడు నన్ను సస్పెండ్ చేస్తూ లేఖపై సంతకం చేశారు’ అని కవిత వ్యాఖ్యానించారు.
News September 3, 2025
పశువుల్లో ‘జోన్స్’ వ్యాధిని ఇలా గుర్తించండి

పశువులు మురికినీరు, శుభ్రంగా లేని మేత తీసుకోవడం, వ్యాధి నిరోధకశక్తి తగ్గినప్పుడు ఈ వ్యాధి వస్తుంది. తల్లికి ఉంటే పుట్టే దూడకు సులభంగా సోకుతుంది. దీంతో వాటి చర్మం మొద్దుబారడం, బక్కచిక్కడం, వెంట్రుకలు ఊడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పశువులకు ఆకలి ఉండదు. మేత తీసుకోకపోవడం వల్ల శరీరం నీరసించి లేవలేని స్థితికి చేరుకుంటాయి. వ్యాధి లక్షణాలు గుర్తించిన వెంటనే పశు వైద్యుడిని సంప్రదించాలి.