News December 28, 2024
నేడు స్కూళ్లకు సెలవు ఉందా?
మాజీ PM మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా కేంద్రం ఇవాళ హాఫ్ డే సెలవు ఇచ్చింది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ సెలవు వర్తిస్తుందని తెలిపింది. విద్యాసంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ హాలిడే వర్తించదు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు ఇవాళ యధావిధిగా పనిచేయనున్నాయి. కాగా, నిన్న తెలంగాణలో ఉద్యోగులు, విద్యార్థులకు సెలవు ప్రకటించారు.
Similar News
News December 28, 2024
RRR పనుల్లో కీలక పురోగతి
TG: రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పనులకు కేంద్రం టెండర్లు పిలిచింది. మొత్తంగా 4 భాగాలుగా విభజించి రూ.5,555 కోట్లతో పనులు చేపట్టేందుకు నిర్ణయించింది. ప్యాకేజీ-1 సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్-రెడ్డిపల్లి, ప్యాకేజీ-2 రెడ్డిపల్లి-ఇస్లాంపూర్, ప్యాకేజీ-3 ఇస్లాంపూర్-ప్రజ్ఞాపూర్, ప్యాకేజీ-4 ప్రజ్ఞాపూర్-రాయగిరి వరకు పనులకు టెండర్లు దాఖలు చేయాలని పేర్కొంది.
News December 28, 2024
నితీశ్కు YS జగన్ అభినందనలు
ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టులో సెంచరీతో అదరగొట్టిన భారత క్రికెటర్ నితీశ్ రెడ్డిని వైసీపీ అధినేత జగన్ అభినందించారు. ‘మెల్బోర్న్లో చిన్న వయసులోనే సెంచరీ చేసిన నితీశ్కు శుభాకాంక్షలు. 21 ఏళ్లలోనే ఈ ఘనత సాధించడం విశేషం. ప్రపంచస్థాయి జట్టుపై అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఆయన సాధించిన విజయం దేశం మొత్తానికి గర్వకారణం. నితీశ్ మరిన్ని విజయాలు సాధించాలి’ అని జగన్ ఆకాంక్షించారు.
News December 28, 2024
విమాన ప్రమాదం దురదృష్టకరం.. సారీ: పుతిన్
కజకిస్థాన్లో జరిగిన విమాన ప్రమాద ఘటన దురదృష్టకరమని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. అందుకు అజర్ బైజాన్ అధ్యక్షుడు ఇల్లామ్ అలియేవ్కు క్షమాపణలు చెప్పారు. అజార్ బైజాన్లోని బాకు నుంచి రష్యా బయల్దేరిన విమానం కజకిస్థాన్లో కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 38 మంది మరణించారు. కాగా ఉక్రెయిన్ డ్రోన్ దాడులను ఎదుర్కొనేందుకు రష్యా ప్రయోగించిన క్షిపణి ఒకటి విమానాన్ని తాకినట్లు అనుమానిస్తున్నారు.