News February 27, 2025
ఇవాళ స్కూళ్లకు సెలవు ఉందా?

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆయా జిల్లాల్లో అధికారులు సెలవు ప్రకటించారు. ఏపీలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో డీఈవోలు సెలవు ప్రకటించినా స్కూల్, కాలేజీ యాజమాన్యాలు ఇవ్వలేదని పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. మరి మీకు సెలవు ఇచ్చారా?
Similar News
News December 5, 2025
కప్పు పట్టేస్తారా? పట్టు విడుస్తారా?

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన IND 3 వన్డేల సిరీస్లో తొలి మ్యాచు గెలిచి ఊపు మీద కనిపించింది. దీంతో ఇంకొక్క మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే అనుకున్నారంతా. కానీ బౌలింగ్ ఫెయిల్యూర్, చెత్త ఫీల్డింగ్తో రెండో వన్డేను చేజార్చుకుంది. దీంతో రేపు విశాఖలో జరిగే చివరి వన్డే కీలకంగా మారింది. మరి భారత ఆటగాళ్లు ఈ మ్యాచులో సమష్టిగా రాణించి, సిరీస్ పట్టేస్తారో లేక SAకు అప్పగిస్తారో చూడాలి.
News December 5, 2025
FEB 8 నుంచి శ్రీశైల బ్రహ్మోత్సవాలు

AP: నంద్యాల(D)లోని శ్రీశైల మల్లన్న ఆలయంలో ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. లక్షలాది మంది భక్తులు రానుండటంతో పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని EO శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. క్యూలు, మంచినీరు, అటవీ ప్రాంతంలో నడకదారి భక్తులకు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. FEB 15న పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కళ్యాణం, 16న స్వామి అమ్మవార్ల రథోత్సవం ఘనంగా నిర్వహించాలన్నారు.
News December 5, 2025
అమెరికాలో ఇద్దరు తెలుగు స్టూడెంట్స్ మృతి

అమెరికాలోని బర్మింగ్హోమ్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. అలబామా యూనివర్సిటీలో చదివే 10 మంది తెలుగు స్టూడెంట్స్ అక్కడి అపార్ట్మెంట్లో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే భవనంలో అగ్నిప్రమాదం జరగడంతో ఇద్దరు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.


