News December 1, 2024
రేపు స్కూళ్లకు సెలవు ఉందా?

AP: ఫెంగల్ తుఫాను ప్రభావంతో శనివారం మధ్యాహ్నం నుంచి తిరుపతి జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ నిన్న ప్రకటించారు. అయితే ఈరోజు కూడా అక్కడ వర్షాలు పడుతున్నాయి. పైగా రేపు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో సోమవారం సెలవు ఇస్తారా? లేదా? అనే సందేహం నెలకొంది. దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
Similar News
News January 21, 2026
HYD: వందేళ్లు దాటినా.. చెక్కుచెదరని ‘ప్యాలెస్ రాజసం’

HYD.. తన గుండెలపై ఘన చరిత్రను మోస్తోంది. చెక్కుచెదరని వందలేళ్ల చారిత్రక కట్టడాలు కళ్లు చెదిరేలా మెరిసిపోతున్నాయి. బేగంపేటలోని పైగా ప్యాలెస్కు 126 ఏళ్లు నిండినా, నేటికీ అదే వైభవంతో వెలిగిపోతోంది. విఖార్ ఉల్ ఉమ్రా నియో-క్లాసికల్ శైలిలో నిర్మించిన ఈ రెండంతస్తుల భవనం 4ఎకరాల్లో విస్తరించింది. 1975-2008 వరకు HUDA కార్యాలయంగా, 2023 వరకు అమెరికా కాన్సులేట్గా సేవలందించింది. త్వరలో HMDA ఆఫీస్గా మారనుంది.
News January 21, 2026
DRDOలో JRF పోస్టులు

బెంగళూరులోని <
News January 21, 2026
నెలసరిలో ఏం తినాలంటే..?

చాలామంది మహిళలు పీరియడ్స్లో క్రేవింగ్స్ వస్తున్నాయని తీపి పదార్థాలు ఎక్కువగా తింటారు. అయితే వీటివల్ల నెలసరి సమస్యలు మరింత పెరుగుతున్నాయంటున్నారు నిపుణులు. ఈ సమయంలో చికెన్, బటానీలు, బీన్స్, పప్పులు, టోఫు, అంజీరా, ఎండుద్రాక్ష, బ్రోకలీ, ఆకుకూరలు, పిస్తా, గుమ్మడి విత్తనాలు, స్ట్రాబెర్రీ, కర్బూజా, యాప్రికాట్, బ్రోకలీ, ఆకుకూరలు, నిమ్మకాయ, నారింజ, బత్తాయి, పీచుపదార్థాలు ఎక్కువగా తినాలని సూచిస్తున్నారు.


