News October 26, 2024

కన్నతల్లిపై కేసు పెట్టిన దౌర్భాగ్యుడు ఉన్నారా?: షర్మిల

image

AP: ఆస్తి విషయంలో వైసీపీ చీఫ్ జగన్ తమపై కేసు పెట్టడం చూసి చాలా బాధేసిందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. కన్నతల్లిపై కేసు పెట్టిన దౌర్భాగ్యుడు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. ‘ప్రతి ఇంట్లో ఇలాంటివి సహజమని అంత సులభంగా ఎలా మాట్లాడుతున్నారు. మీకు మానవత్వం లేదా? మీకు ఎమోషన్స్ లేవా?’ అని జగన్‌ను నిలదీశారు. జగన్ మోచేతి నీళ్లు తాగే వ్యక్తి వైవీ సుబ్బారెడ్డి అని షర్మిల దుయ్యబట్టారు.

Similar News

News December 25, 2025

త్వరలో కొత్త మెయిల్ ఐడీలు! గూగుల్ కీలక నిర్ణయం

image

త్వరలో జీమెయిల్ యూజర్ ఐడీ మార్చుకునే ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు గూగుల్ వెల్లడించింది. కొత్త యూజర్ ఐడీతోపాటు పాత ఐడీ యాక్టివ్‌గానే ఉంటుందని, ఇన్‌బాక్స్ ఒకటేనని తెలిపింది. పాత ఐడీ మళ్లీ పొందాలంటే 12నెలలు ఆగాల్సిందేనని చెప్పింది. జీమెయిల్ అకౌంట్‌తో లింకైన ఫేస్‌బుక్, ఇన్‌స్టా, వాట్సాప్, ఆధార్ యూజర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. ఈ ఫీచర్‌ దశలవారీగా అమలులోకి వస్తుందని తెలిపింది.

News December 25, 2025

బాబువన్నీ చిల్లర రాజకీయాలే: కాకాణి

image

AP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజలు కోటి సంతకాలు చేసినా CM లెక్కలేనితనంతో వ్యవహరిస్తున్నారని YCP నేత కాకాణి గోవర్ధన్ మండిపడ్డారు. ‘పేదలకు మేలు చేసేలా జగన్ వైద్యరంగాన్ని అభివృద్ధి చేశారు. వాటిని నీరుగార్చి ప్రైవేటుతో మేలుచేస్తానంటే ఎవరూ నమ్మరు. ఎన్నికకో పార్టీతో పొత్తు పెట్టుకొని చిల్లర రాజకీయాలు చేస్తూ నావి హుందా పాలిటిక్స్ అని CBN అనడం హాస్యాస్పదం’ అని ఎద్దేవా చేశారు.

News December 25, 2025

బైక్స్, కార్ల వెంట కుక్కల పరుగులు.. కారణమేంటి?

image

స్పీడ్‌గా వెళ్లే బైక్స్, కార్లను చూస్తే కుక్కల్లో వేటాడే స్వభావం బయటపడుతుంది. హారన్, ఇంజిన్, సైలెన్సర్ సౌండ్స్‌తో ఉద్రేకం పెరిగి వెంటపడతాయి. వాహనాల పొగ నుంచి వచ్చే స్మెల్ కూడా కారణం కావొచ్చు. కొన్ని వీధి కుక్కలు అవి తిరిగే రోడ్డును తమ ప్రాంతంగా భావిస్తాయి. అక్కడికి వచ్చిన వాహనాల వెంట పరిగెడతాయి. కుక్కలు అన్నీ ఒకేలా బిహేవ్ చేస్తాయని చెప్పలేం. కొన్ని మాత్రమే వాహనాల వెంట పరిగెడుతూ ఇబ్బంది పెడతాయి.