News March 20, 2025

మాలా ఉద్యోగాలిచ్చిన రాష్ట్రమేదైనా ఉందా?: సీఎం రేవంత్

image

TG: తమ ప్రజాపాలనలో 10 నెలల్లోనే 59వేల ఉద్యోగాలిచ్చామని సీఎం రేవంత్ అన్నారు. ‘నేను సవాల్ చేస్తున్నా. ఉమ్మడి రాష్ట్రంలోకానీ, ప్రధాని మోదీ సీఎంగా పనిచేసిన గుజరాత్‌లో కానీ, దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన యూపీలో కానీ మేం ఇచ్చినట్లుగా 10నెలల్లోనే 59వేల ఉద్యోగాలిచ్చినట్లు రికార్డ్ ఉందా? నేను చర్చకు సిద్ధం. విజ్ఞతతో ఉద్యోగాలిచ్చాం. ప్రజాపాలనతో దేశానికే తెలంగాణ ఓ మోడల్‌గా నిలబడింది’ అని పేర్కొన్నారు.

Similar News

News March 21, 2025

అమెరికా విద్యాశాఖ మూసేస్తూ ట్రంప్ కీలక నిర్ణయం

image

అమెరికాలో విద్యాశాఖను మూసేస్తూ ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిననాటి నుంచి ప్రభుత్వంపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ట్రంప్ పలు సంచలన నిర్ణయాలు తీసుకోగా తాజాగా విద్యాశాఖపై బాంబ్ పేల్చారు. ఇందులో భాగంగానే ఇటీవల ఆ శాఖలోని ఉద్యోగాల్లో కోతలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా విద్యాశాఖను మూసేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశారు.

News March 21, 2025

నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల

image

AP: తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్త్ర దీపాలంకార సేవా టికెట్ల జూన్ నెల కోటాను ఇవాళ ఉదయం 10 గంటలకు TTD ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అలాగే, జూన్ 9- 11 వరకు జరుగనున్న శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలకు సంబంధించి టికెట్లు ఉ.11 గంటలకు రిలీజ్ అవుతాయి. వీటితో పాటు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జూన్ నెల కోటా టోకెన్లు మ.3 గంటలకు విడుదల కానున్నాయి.

News March 21, 2025

సరికొత్త వివాదంలో OLA!

image

విద్యుత్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఓలా కొత్త వివాదంలో చిక్కుకుంది. ఓలా వెల్లడించిన వాహన విక్రయాల సంఖ్య, వాహన రిజిస్ట్రేషన్ల సంఖ్యకు సరిపోలడం లేదని కేంద్రం గుర్తించింది. దీనిపై దర్యాప్తు చేయాలని ARAIని ఆదేశించింది. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాగా FEBలో 25వేల వాహనాలు అమ్మినట్లు OLA పేర్కొనగా వాహన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ల సంఖ్య 8,652గా ఉండటం గమనార్హం.

error: Content is protected !!