News July 21, 2024
ఏపీలో లా అండ్ ఆర్డర్ ఉందా?: అంబటి

AP: ముచ్చుమర్రి బాలిక హత్యాచారం ఘటనలో మృతదేహాన్ని ఇంకా ఎందుకు కనిపెట్టలేకపోయారో హోం మంత్రి అనిత సమాధానం చెప్పాలని YCP నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ‘ఈ కేసులో ఓ దళిత వ్యక్తి లాకప్ డెత్ అయ్యారు. దీనిపై దళిత సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. పుంగనూరులో MP మిథున్ రెడ్డిపై పోలీసుల సమక్షంలోనే దాడి జరిగింది. APలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా? YCP నేతలపై దాడులకు తెగబడుతున్నారు’ అని ఫైర్ అయ్యారు.
Similar News
News November 4, 2025
ప్రభుత్వానికి లిక్కర్ కంపెనీల అల్టిమేటం

TG: పెండింగ్ బకాయిలను చెల్లించకపోతే డిసెంబర్‌లో మద్యం కొరత, ఆర్థిక విపత్తు తప్పదని లిక్కర్, బేవరేజెస్ కంపెనీల సంఘం ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. ₹3,366 కోట్ల బకాయిలు రాకపోవడంతో ఆర్థిక సమస్యలతో మద్యం తయారీలో ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొంది. బిల్లులు చెల్లించకుంటే మద్యం ఉత్పత్తిని నిలిపివేయడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేసింది.
News November 4, 2025
నలుగురు ఎమ్మెల్యేలను విచారించనున్న స్పీకర్

TG: ఈ నెల 6 నుంచి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ రెండో విడత విచారణ చేపట్టనున్నారు. 6, 12న తెల్లం వెంకట్రావ్, సంజయ్, 7, 13న పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీలను రెండు సార్లు విచారించనున్నారు. తొలుత పిటిషనర్లు, తర్వాత ప్రతివాదులను ఆయన క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. అంతకుముందు తొలి విడతలో <<17912398>>ఇద్దరు<<>> ఎమ్మెల్యేలను విచారించిన సంగతి తెలిసిందే.
News November 4, 2025
APEDAలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

న్యూఢిల్లీలోని అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్‌డ్ ఫుడ్ ప్రొడక్ట్ ఎక్స్‌పర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ(APEDA) 6 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. BSc( అగ్రికల్చర్, హార్టికల్చర్, ప్లాంటేషన్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, వెటర్నరీ సైన్స్, ఫుడ్ ప్రాసెసింగ్), పీజీ(కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఐటీ) అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 1వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.


