News April 7, 2025
రజినీ ‘కూలీ’కి అంత డిమాండా?

సూపర్‌స్టార్ రజినీకాంత్ కూలీ సినిమాకు టాలీవుడ్లో భారీ డిమాండ్ నెలకొంది. ఏకంగా ఆరుగురు నిర్మాతలు హక్కుల కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం. దీంతో సినిమా నిర్మాతలు రూ.40 కోట్ల వరకూ రేట్ చెబుతున్నట్లు తెలుస్తోంది. లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ‘రజినీ’ సినిమా కావడం, నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర వంటి వారు కీలక పాత్రలు చేయడం మూవీకి ఈ స్థాయిలో క్రేజ్‌ను తీసుకొచ్చిందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Similar News
News April 9, 2025
ఈ విధ్వంసకర ఆటగాడికి ఏమైంది?

ఆండ్రీ రస్సెల్.. T20 క్రికెట్లో విధ్వంసకర ఆటగాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌లను మలుపుతిప్పే మేటి ఆల్‌రౌండర్. ఇదంతా గతేడాది వరకు. IPL-2025లో KKR తరఫున బ్యాటింగ్‌కు దిగిన 4 మ్యాచ్‌ల్లో 4,5,1,7 స్కోర్లతో ఘోరంగా విఫలమయ్యారు. 2024 JUL నుంచి ENG టూర్, ది హండ్రెడ్, CPL, ILT20, BPL, IPLలో మొత్తం 33 మ్యాచ్‌ల్లో 15 Avgతో 387 రన్స్ చేశారు. 5 మ్యాచ్‌ల్లో 3 ఓటములతో కష్టాల్లో ఉన్న KKRకు రస్సెల్ ఫామ్ ఎంతో కీలకం.
News April 9, 2025
పొలిటికల్ ఎంట్రీపై రేణూ దేశాయ్ కీలక వ్యాఖ్యలు

సామాజిక సేవ చేయడంలోనే తనకు ఆనందం ఉందని, ఏ చిన్నారీ ఆకలితో ఉండకూడదనుకుంటానని నటి రేణూ దేశాయ్ వెల్లడించారు. రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం వచ్చినా పిల్లల కోసం వదులుకున్నానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. పాలిటిక్స్ తన జాతకంలో ఉన్నప్పటికీ విధిరాతకు వ్యతిరేకంగా వెళ్తున్నట్లు చెప్పారు. ఏదైనా పార్టీలో చేరితే తప్పకుండా చెబుతానని, దాన్ని రహస్యంగా దాచలేమని పేర్కొన్నారు.
News April 9, 2025
రాష్ట్రానికి త్వరలో కొత్త మద్యం బ్రాండ్లు

TGలో కొత్త బ్రాండ్లు సరఫరా చేసేందుకు మద్యం కంపెనీలు పోటీపడుతున్నాయి. రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ ప్రకటనతో 604 రకాల బ్రాండ్లు సరఫరా చేసేందుకు 92 కంపెనీలు అప్లై చేసుకున్నాయి. వీటిలో 331 కొత్తవి, 273 ఫారిన్ బ్రాండ్లున్నాయి. ప్రస్తుతం 6 కంపెనీలే లిక్కర్ సరఫరా చేస్తున్నాయి. గుత్తాధిపత్యం లేకుండా కొత్త కంపెనీలను ఎంపిక చేయాలని సర్కార్ యోచిస్తోంది. త్వరలో ఈ బ్రాండ్లు మార్కెట్లోకి రానున్నాయి.