News October 27, 2024
దీపావళి కానుక ఇదేనా చంద్రబాబు: జగన్

AP: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచాలన్న ప్రతిపాదనపై YCP చీఫ్ జగన్ సెటైర్లు వేశారు. ప్రజలకు ఇస్తున్న దీపావళి కానుక కరెంట్ ఛార్జీలు పెంచడమేనా చంద్రబాబు అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి ఉంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించేవారిమని చెప్పి, ఇప్పుడు భారీ స్థాయిలో పెంచి మాట తప్పడమే చంద్రబాబు నైజమని రుజువు చేశారని విమర్శించారు. ఈ విషయమై వైసీపీపై నిందలు వేయడం ఎంత వరకు సమంజసమన్నారు.
Similar News
News November 28, 2025
గంభీర్పై తివారీ ఘాటు వ్యాఖ్యలు

SAతో స్వదేశంలో టెస్ట్ సిరీస్లో 0-2తో ఓటమి తరువాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై విమర్శలు పెరుగుతున్నాయి. ఆయనను వెంటనే తొలగించాలంటూ మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ డిమాండ్ చేశారు. గంభీర్ తప్పుడు వ్యూహాలు, జట్టులో అతి మార్పులే ఈ పరాజయానికి కారణమని ఆరోపించారు. ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ విజయాలకు రోహిత్ శర్మ, ద్రవిడ్, కోహ్లీ నిర్మించిన జట్టే కారణమని, గంభీర్ ప్రభావం లేదని తివారీ పేర్కొన్నారు.
News November 28, 2025
బాపట్ల DWCWEOలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

AP: బాపట్లలోని డిస్ట్రిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్& ఎంపవర్మెంట్ ఆఫీస్ (DWCWEO)లో 8 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంబీబీఎస్, ఇంటర్, బీఏ(సోషల్ వర్క్/సోషియాలజీ/సోషల్ సైన్సెస్), డిగ్రీ, బీఈడీ, 7వ తరగతి అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 25-42ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్సైట్: https://bapatla.ap.gov.in/
News November 28, 2025
పవన్ రాజోలు పర్యటనలో అపరిచిత వ్యక్తి!

AP: పవన్ రాజోలు పర్యటనలో అపరిచిత వ్యక్తి కదలికలపై Dy.CM కార్యాలయం పోలీసులకు సమాచారమిచ్చింది. ‘శంకరగుప్తం డ్రెయిన్ మూలంగా దెబ్బతిన్న కొబ్బరి తోటలు పరిశీలిస్తున్నప్పుడు, అధికారులతో సంభాషిస్తున్నప్పుడు, ఆ తర్వాత కార్యక్రమాల్లోనూ ఆ వ్యక్తి ఉప ముఖ్యమంత్రికి సమీపంలో సంచరించారు. అతను రాజోలు నియోజకవర్గ YCP కార్యకర్తగా సమాచారమందింది. ఈ విషయాన్ని కోనసీమ జిల్లా SP దృష్టికి తీసుకెళ్లాం’ అని తెలిపింది.


