News November 29, 2024

ఇదేం తిక్క వాదన జగన్?: టీడీపీ

image

AP: కరెంటులో రూ.వేల కోట్ల దొంగతనం బయటపడకుండా మాజీ సీఎం జగన్ తలతిక్క పోలిక చేశారని టీడీపీ మండిపడింది. 2015 సంవత్సరం ధరతో 2021 ధర పోల్చి తిక్క వాదన చేయడం ఏంటని ప్రశ్నించింది. టెక్నాలజీ పెరిగే కొద్దీ ఛార్జీలు తగ్గుతాయనే కనీస బుర్ర కూడా లేదా? అని నిలదీసింది. ‘2015లో చంద్రబాబు రూ.4.43కి కొన్నారు. నేను 2021లో రూ.2.49కి కొన్నాను అంటావా’ అంటూ ట్వీట్ చేసింది.

Similar News

News November 29, 2024

YCP హయాంలోనే అక్రమ రవాణా: వనమాడి

image

AP: YCP హయాంలోనే కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా మొదలైందని MLA వనమాడి వెంకటేశ్వరరావు ఆరోపించారు. YCP మాజీ MLA ద్వారంపూడి ప్రమేయంతో ఇదంతా జరుగుతోందన్నారు. పేదలకు అందజేయాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించి వ్యాపారం చేశారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పారు. రేషన్ అక్రమ రవాణా నేపథ్యంలో <<14741555>>వనమాడిపై<<>> పవన్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

News November 29, 2024

BREAKING: తుఫాన్.. అతితీవ్ర భారీ వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతంలో ‘ఫెంగల్’ తుఫాను ఏర్పడినట్లు APSDMA ప్రకటించింది. ప్రస్తుతానికి ఇది పుదుచ్చేరికి 270కి.మీ, చెన్నైకి 300కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్నిచోట్ల ఇవాళ, రేపు అతితీవ్ర భారీ, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

News November 29, 2024

అన్ని దేశాలూ వారికి సోషల్ మీడియా నిషేధాన్ని విధించాలి: నాగబాబు

image

ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు వారికి <<14737992>>సోషల్ మీడియాను నిషేధించిన<<>> సంగతి తెలిసిందే. అది చాలా మంచి నిర్ణయమని జనసేన నేత నాగబాబు పేర్కొన్నారు. ‘నేటి పిల్లలు సోషల్ మీడియా చట్రంలో చిక్కుకుని భవిష్యతును చేజార్చుకుంటున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అన్ని దేశాలకి ఆదర్శం. అన్ని దేశాలూ దీన్ని అనుసరిస్తే మనం మంచి సమాజాన్ని, జాతిని, ప్రపంచాన్ని చూస్తాం’ అని ట్వీట్ చేశారు.