News November 28, 2024

ఇదేం కక్కుర్తి?.. ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూనే సామాజిక పింఛన్

image

కేరళలో పెన్షన్ స్కామ్ బయటికొచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న 1,458 మంది రూ.1,600 చొప్పున సామాజిక పింఛన్ తీసుకుంటున్నట్లు తేలింది. ప్రతి నెలా రూ.23 లక్షలకు పైగా ప్రజాధనాన్ని వీరు కాజేస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు వారు తీసుకొన్న పెన్షన్ మొత్తాన్ని వడ్డీతో సహా రికవరీ చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించింది.

Similar News

News November 28, 2024

IPL: జితేశ్ శర్మ హైక్ 5,400 శాతం..!

image

ఐపీఎల్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని రికార్డును టీమ్ ఇండియా ప్లేయర్ జితేశ్ శర్మ అందుకున్నారు. వేలంలో ఆయన తన పాత ధర కంటే 5,400% ఎక్కువ పలికారు. 2024లో ఆయన రూ.20 లక్షలకే పంజాబ్ తరఫున ఆడారు. ఈ వేలంలో ఏకంగా రూ.11 కోట్లతో తన పంట పండించుకున్నారు. ఇంత భారీ మొత్తంలో శాలరీ హైక్ సాధించిన ప్లేయర్ మరొకరు లేరు. వికెట్ కీపింగ్ నైపుణ్యం, లోయర్ ఆర్డర్‌లో ఫినిషర్‌గా మంచి పేరుండటంతో RCB అతడిని కొనేసింది.

News November 28, 2024

కొండా సురేఖపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

image

TG: మంత్రి కొండా సురేఖపై నటుడు నాగార్జున వేసిన పరువు నష్టం దావాను నాంపల్లి కోర్టు పరిగణనలోకి తీసుకుంది. సురేఖపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. డిసెంబర్ 12న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆమెకు సమన్లు జారీ చేసింది. కాగా తన పరువుకు భంగం కలిగించేలా అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.

News November 28, 2024

మా త‌దుప‌రి ల‌క్ష్యం అదే: అజిత్ ప‌వార్‌

image

గ‌తంలో జాతీయ హోదా కలిగిన NCPని తిరిగి ఆ స్థాయికి తీసుకురావ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని పార్టీ చీఫ్ అజిత్ ప‌వార్ పేర్కొన్నారు. కొత్త త‌రాన్ని ముందుకు తీసుకువ‌స్తామ‌ని, అందులోనూ మ‌హిళ‌ల‌కు అధిక ప్రాధాన్యం ఇస్తామ‌న్నారు. Decలో పార్టీ జాతీయ స‌ద‌స్సు నిర్వ‌హించ‌నున్న‌ట్టు తెలిపారు. 3 స్టేట్స్‌లో రాష్ట్ర పార్టీగా ఉన్నామని, రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయనున్నట్టు NCP MP ప్ర‌ఫుల్ ప‌టేల్ తెలిపారు.