News June 22, 2024
ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ రోల్ ఇదేనా?

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబోలో మూవీ తెరకెక్కనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర రాక్షసుడిలా ఎంతో వైల్డ్గా ఉంటుందని సమాచారం. ఇప్పటికే హృతిక్ రోషన్ ‘వార్-2’ మూవీలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారని చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో నీల్ సినిమాలో పాత్ర ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
Similar News
News January 31, 2026
TODAY HEADLINES

* AP: HYDకి మించిన నగరంగా అమరావతి: CBN
* AP: 3న క్యాబినెట్ భేటీ.. 11 నుంచి బడ్జెట్ సమావేశాలు
* AP: గ్రూప్-1 ఫలితాలు విడుదల
* AP: కల్తీ నెయ్యితో 20Cr లడ్డూలు తయారీ: TTD ఛైర్మన్
* TG: మేడారం జాతర.. మొక్కులు తీర్చుకున్న లక్షల మంది
* TG: నందినగర్లోనే కేసీఆర్ విచారణ: సిట్
* TG: ముగిసిన ‘మున్సిపల్’ నామినేషన్లు.. 11న పోలింగ్
* TG EAPCET షెడ్యూల్ రిలీజ్
* వచ్చే ఏడాది APR 7న ‘వారణాసి’ రిలీజ్
News January 31, 2026
బెదిరింపులు ఆపితే అమెరికాతో చర్చలకు సిద్ధమే: ఇరాన్

ట్రంప్ ప్రభుత్వం తన బెదిరింపులను ఆపితే చర్చలకు సిద్ధమని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ ప్రకటించారు. ఇరాన్ యుద్ధానికి ఎంత సిద్ధంగా ఉందో, చర్చలకూ అంతే సంసిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అయితే తమ మిస్సైల్ కార్యక్రమంపై మాత్రం రాజీ పడబోమని తేల్చి చెప్పారు. అమెరికా సైనిక చర్యలకు దిగితే అది ఇరు పక్షాల మధ్య యుద్ధంగా మిగిలిపోదని, మిడిల్ ఈస్ట్ అంతటా ఉద్రిక్తతలకు దారితీస్తుందని హెచ్చరించారు.
News January 31, 2026
రీప్లేస్మెంట్కు రెడీ.. పాక్ స్థానంలో ఆడతామన్న ఉగాండా

T20 WCలో ఆడటంపై పాక్ ఇప్పటికీ తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. దీంతో క్రికెట్ ఆడే చిన్న దేశాలు పాకిస్థాన్ను ట్రోల్ చేస్తున్నాయి. ఇప్పటికే దాని స్థానంలో తమకు అవకాశం ఇవ్వాలని కోరిన <<18982902>>ఐస్లాండ్<<>>.. ఆ వెంటనే అందుబాటులో ఉండలేమని సెటైరికల్ పోస్ట్ చేసింది. ఇది ఉగాండాకు కలిసొస్తుందని పేర్కొంది. దీంతో నేడు ఉగాండా కూడా అవకాశం ఉంటే ఆడేందుకు తాము సిద్ధమని.. బ్యాగ్లు రెడీ చేసుకున్నామని ఫన్నీగా పోస్ట్ పెట్టింది.


