News April 19, 2024

ఇదేనా రాజకీయం?

image

తెలంగాణలో ‘టచ్’ రాజకీయాలు నడుస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ మంత్రులు అంటుంటే.. 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలే టచ్‌లో ఉన్నారంటూ బీఆర్ఎస్ నేతలంటున్నారు. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ బీజేపీ చెబుతోంది. ఇదంతా గమనిస్తున్న ప్రజలు.. ‘ఇవేం రాజకీయాలు?’ అని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News January 16, 2026

భూమికి జనుము, అలసంద చేసే మేలు

image

ఎకరంలో 6-8KGల జనుము విత్తనాలు చల్లి పూతకు వచ్చాక కలియదున్నితే భూమికి 40KGల నత్రజని, 60KGల భాస్వరం, 25KGల పొటాషియం, ఇతర పోషకాలు అందుతాయి. ఎకరంలో 14-15KGల అలసంద విత్తనాలను చల్లి పంట కోత తర్వాత మొదళ్లను, ఆకులను భూమిలో కలియదున్నితే 35KGల నత్రజని, 8KGల భాస్వరం, 24KGల పొటాష్ భూమికి అందుతాయి. ఇవి భూమికి అధిక పోషకాలను అందించడంతోపాటు చౌడు, కలుపు సమస్యను తగ్గిస్తాయి.

News January 16, 2026

మొన్న SETBACK.. నిన్న COMEBACK

image

WPLలో UPW క్రికెటర్ హర్లీన్ డియోల్ బ్యాటుతో అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు. మొన్న DCతో మ్యాచ్‌లో హర్లీన్‌(36 బంతుల్లో 47రన్స్) స్లోగా ఆడుతున్నారనే కారణంతో కోచ్ అభిషేక్ నాయర్ ఆమెను రిటైర్డ్ ఔట్‌గా ప్రకటించి మైదానం నుంచి బయటికి పిలిచారు. ఆ చర్యతో క్రికెట్ అనలిస్టులు సైతం ఆశ్చర్యపోయారు. కాగా తన ఈగో హర్ట్ అయ్యిందేమో అన్నట్లుగా నిన్న MIపై 64(39 బాల్స్) స్కోర్ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు.

News January 16, 2026

173 పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

image

NCERTలో 173 పోస్టులకు అప్లై చేయడానికి దరఖాస్తు గడువును పెంచారు. అర్హతగల వారు జనవరి 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్ , డిగ్రీ, డిప్లొమా( ప్రింటింగ్ టెక్నాలజీ, గ్రాఫిక్స్), ITI, B.Tech, M.Tech, PG, MBA, B.L.Sc, M.L.Sc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. రాతపరీక్ష/CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.ncert.nic.in