News December 21, 2024
ఇదేనా రేవంత్… నువ్వు తీసుకొచ్చిన మార్పు?: కేటీఆర్
TG: ఆటోడ్రైవర్లకు ఇస్తానన్న ₹12వేల సాయం ఏమైందని CM రేవంత్‌ను KTR ప్రశ్నించారు. ఆటో డ్రైవర్లతో పాటు అన్ని వర్గాలను మోసగించారని విమర్శించారు. సిద్దిపేటలో అప్పుల బాధతో ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న వార్తను షేర్ చేశారు. ‘ఇదేనా రేవంత్ నువ్వు తీసుకొచ్చిన మార్పు? పైసలతో ధగ ధగ మెరిసిన చేతుల్లోకి పురుగు మందుల డబ్బాలు రావడమే మార్పా? ఆనందమయ జీవితాల్లోకి ఆత్మహత్య ఆలోచన చొరబడటమే మార్పా?’ అని ట్వీట్ చేశారు.
Similar News
News December 21, 2024
‘మిషన్ భగీరథ’ విఫలం.. నిరూపిస్తా లేదంటే రాజీనామా చేస్తా: జూపల్లి
కేటీఆర్ చేసిన సవాలుకు మంత్రి జూపల్లి ప్రతి సవాల్ విసిరారు. 60శాతం గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని అన్నారు. ‘నీళ్లు రావట్లేదన్న విషయాన్ని నేను 100శాతం నిరూపిస్తా. నిరూపించలేకపోతే రాజీనామా చేస్తా. ఏ పద్ధతిలో ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారో, అందులో ఏం జరిగిందో నాకు తెలుసు. రూ.8 లక్షల కోట్ల అప్పు చేసి కూడా ప్రాజెక్టుల్ని పూర్తి చేయలేకపోయారు. భూ సమీకరణకు కూడా డబ్బులివ్వలేదు’ అని మండిపడ్డారు.
News December 21, 2024
‘ఉచిత బస్సు‘పై అధ్యయనానికి మంత్రుల కమిటీ: ప్రభుత్వం
AP: మహిళలకు ఉచిత బస్సు పథకం వివిధ రాష్ట్రాల్లో ఎలా అమలవుతుందో అధ్యయనం చేసేందుకు మంత్రుల బృందంతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌కు అనువైన పథకాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు ఓ సర్క్యులర్‌లో తెలిపింది. రవాణా, మహిళా-శిశు సంక్షేమ , హోంశాఖ మంత్రులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని వివరించింది. ఎన్నికల సమయంలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూటమి ప్రకటించింది.
News December 21, 2024
కేటీఆర్ ఆ విషయాన్ని నిరూపిస్తే రాజీనామా చేస్తా: వెంకట్‌రెడ్డి
24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తమదేనన్న KTR వ్యాఖ్యల్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తప్పుబట్టారు. ‘11 నుంచి 13 గంటలు మాత్రమే కరెంట్ ఇచ్చారు. నేను స్వయంగా గ్రామాల్లో తిరిగి తెలుసుకున్నాను. కేటీఆర్ తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలి. రైతు బంధుతో సాగు పెరిగిందని KTR అంటున్నారు. నల్గొండ జిల్లాలో ఒక్క ఎకరా ఆయకట్టు పెరిగినట్లు నిరూపించినా రాజీనామా చేస్తా’ అని సవాల్ చేశారు.