News November 9, 2024
ఇదేనా మీరు తెచ్చిన మార్పు?: హరీశ్ రావు

TG: రాష్ట్రంలో సమస్యలను పట్టించుకోకుండా CM, మంత్రులు పక్క రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. ‘ఉత్తమ్ సొంత జిల్లాలో వడ్ల కొనుగోళ్లు జరగవు. బిల్లులు రాక పంచాయతీ ఆఫీస్ తాకట్టు పెడుతున్నా భట్టి పట్టించుకోరు. మద్దతు ధర లేక పత్తి రైతులు కన్నీళ్లు పెడుతున్నా సీతక్క కనికరించరు. విద్యార్థుల ప్రాణాలు పోతున్నా రేవంత్ నిద్ర వీడరు. ఇదేనా మీరు చెప్పిన మార్పు?’ అని ఫైరయ్యారు.
Similar News
News November 21, 2025
7వ తరగతి అర్హతతో కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలు

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 27 కాంట్రాక్ట్ ఆపరేటర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఏడో తరగతి ఉత్తీర్ణతతో పాటు హెవీ వెహికల్ లైసెన్స్, ఉద్యోగ అనుభవం ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.200, SC,STలకు ఫీజు లేదు.
News November 21, 2025
పత్తి, వేరుశనగలో ఈ ఎర పంటలతో లాభం

☛ పత్తి, వేరుశనగ పంటల్లో ఆముదపు పంటను ఎరపంటగా వేసి పొగాకు లద్దె పురుగుల్ని, బంతి మొక్కలు వేసి శనగ పచ్చపురుగులను సులభంగా నివారించవచ్చు.
☛ వేరుశనగలో అలసందలు వేసి ఎర్ర గొంగళి పురుగుల ఉద్ధృతిని తగ్గించవచ్చు.
☛ వేరుశనగలో పొగాకు లద్దెపురుగు నివారణకు ఆముదం లేదా పొద్దుతిరుగుడు పంటను ఎరపంటగా వేసుకోవాలి. ఎకరానికి 100 మొక్కలను ఎర పంటగా వేసుకోవాలి.
News November 21, 2025
ఇండీ కూటమిని బలోపేతం చేస్తాం: కాంగ్రెస్

ప్రతిపక్ష ఇండీ కూటమిని బలోపేతం చేస్తామని కాంగ్రెస్ తెలిపింది. బిహార్‌లో ఘోర ఓటమితో కూటమి మనుగడపై సందేహాలు మొదలైన నేపథ్యంలో క్లారిటీ ఇచ్చింది. ‘INDIA ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏమీ మారలేదు. కూటమిని బలోపేతం చేసేందుకు రెట్టింపు ప్రయత్నాలు చేస్తాం. డిసెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే వింటర్ సెషన్లో ప్రతిపక్షాలు సమన్వయంతో ముందుకు సాగుతాయి’ అని AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు.


