News August 9, 2024

NTR-NEEL సినిమా కాన్సెప్ట్ ఇదేనా?

image

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కనున్న ‘NTR31’ మూవీ స్టోరీ ఇదేనంటూ నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్‌, క్యాప్షన్ ఆధారంగా 1969లో మహారాష్ట్ర తారాపూర్‌లో ప్రారంభమైన తొలి వాణిజ్య అణు విద్యుత్ కేంద్రం చుట్టూ కథ నడుస్తుందంటున్నారు. అందులో NTR కార్మికుడిగా పనిచేస్తారేమోనంటూ ఊహించుకుంటున్నారు. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మీరేమంటారు?

Similar News

News March 26, 2026

దావోస్ పర్యటనల్లో రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులు: శ్రీధర్ బాబు

image

TG: 2024, 2025 దావోస్ పర్యటనల్లో రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులకు 44 కంపెనీలతో MOU చేసుకున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ సంస్థల గ్రౌండింగ్ వివిధ దశల్లో ఉందని అసెంబ్లీలో తెలిపారు. వీటివల్ల 68,150 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుందని చెప్పారు. ‘రూ.81,800 కోట్ల పెట్టుబడికి సంబంధించి 6 కంపెనీలకు భూములు కేటాయించాం. దీనివల్ల ప్రభుత్వానికి రూ.1,540 కోట్ల ఆదాయం సమకూరింది’ అని వివరించారు.

News March 26, 2026

‘ఆపరేషన్ సిందూర్’పై సినిమా తీస్తున్నా: వివేక్ అగ్నిహోత్రి

image

పాక్ ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ చేసిన ‘ఆపరేషన్ సిందూర్’ కథాంశంతో సినిమాను తెరకెక్కించనున్నట్లు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి వెల్లడించారు. ఈ చిత్రాన్ని T-సిరీస్ నిర్మిస్తుందని తెలిపారు. ‘ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరమైన కథలను చెప్పడానికి నేను సిద్ధం. ధైర్యం, స్పష్టత, ప్రొఫెషనలిజమ్‌తో సినిమాలు తీయడానికి ప్రాధాన్యం ఇస్తా. ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని కల్పించడానికే నా ప్రయత్నం’ అని పేర్కొన్నారు.

News March 26, 2026

ఏప్రిల్ 4 నుంచి టెన్త్ వాల్యుయేషన్

image

APలో ఈ నెల 16 నుంచి కొనసాగుతోన్న టెన్త్ ఎగ్జామ్స్ APR 2తో ముగుస్తాయి. వచ్చే నెల 4 నుంచి 13 మధ్య వాల్యుయేషన్ పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులురెడ్డి వెల్లడించారు. ఈసారి ట్యాబ్స్ ద్వారా మూల్యాంకనం సెంటర్లలోనే మార్కులను నమోదు చేస్తారన్నారు. అన్ని కేంద్రాల్లో CCTVలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా APR మూడో వారంలో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది.