News January 8, 2025
ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ఇదేనా!

వచ్చే నెల 19న ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత జట్టు ఎంపిక పూర్తైనట్లు తెలుస్తోంది. గాయం నుంచి కోలుకొని షమీ తిరిగి జట్టులో చేరనున్నట్లు సమాచారం. CTలో భారత్ తొలి మ్యాచ్ FEB 20న బంగ్లాదేశ్‌తో, 23న పాక్‌తో ఆడనుంది.
జట్టు అంచనా: రోహిత్(C), కోహ్లీ, గిల్, జైస్వాల్, శ్రేయస్, రాహుల్, పంత్, హార్దిక్, జడేజా, అక్షర్, కుల్దీప్, బుమ్రా, సిరాజ్, షమీ, అర్ష్‌దీప్.
Similar News
News January 7, 2026
ఈశ్వరప్ప హత్య కేసులో నలుగురి అరెస్ట్

తనకల్లు పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన ఈశ్వరప్ప హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు కదిరి డీఎస్పీ శివ నారాయణ స్వామి వెల్లడించారు. రాగినేపల్లికి చెందిన హరి, చిన్నప్ప, గంగులప్ప, శంకరప్పను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి హత్యకు వాడిన స్కార్పియో వాహనం, రెండు కొడవళ్లు, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగంగా ఛేదించిన పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
News January 7, 2026
ఒకే బెడ్‌రూమ్‌లో రెండు బెడ్‌లు ఉండవచ్చా?

ఒకే బెడ్‌రూమ్‌లో రెండు బెడ్‌లు ఉండడం వాస్తు ప్రకారం సరికాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ఇది భార్యాభర్తల మధ్య గొడవలు తేవొచ్చని అంటున్నారు. విరిగిపోయిన ఫర్నిచర్, పనికిరాని పాత వస్తువులు ఇంట్లో ఉంచితే ప్రతికూల శక్తి పెరుగుతుందని అంటున్నారు. ‘గురువుల చిత్రపటాలు చదువుకునే గదిలో ఉంచితే వారి ఆశీస్సులు అందుతాయి. ఇంటి శ్రేయస్సు, అభివృద్ధి కోసం ఈ నియమాలు పాటించాలి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News January 7, 2026
మీ పిల్లలు అబద్ధాలు చెబుతున్నారా?

తల్లిదండ్రులతో టీనేజర్స్ ఎక్కువగా అబద్ధాలు చెబుతుంటారు. అయితే ఇది కౌమారదశలో ఓ భాగమని నిపుణులు చెబుతున్నారు. పేరెంట్స్ ఏమంటారోనని భయంతో, ‘మేం మంచి పిల్లలం’ అనిపించుకోడానికి అబద్ధాలు చెబుతారని అంటున్నారు. తమ హద్దులు, అమ్మానాన్నల రియాక్షన్స్ తెలుసుకోవడానికి నిజాలు దాస్తారని పేర్కొంటున్నారు. వాళ్లు మరింత స్వేచ్ఛను కోరుకుంటున్నారని అర్థమని, అతిగా నిర్బంధించవద్దని సూచిస్తున్నారు.


