News June 21, 2024

ఆడబిడ్డలకు మీరు కల్పించే రక్షణ ఇదేనా?: YCP

image

AP: కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరవైందని వైసీపీ విమర్శించింది. ‘బాపట్లలో యువతిపై పాశవికంగా అత్యాచారం చేసి చంపేశారు. రాష్ట్రంలో మహిళలపై అప్పుడే దారుణాలు మొదలయ్యాయి. ఆడబిడ్డలకు మీరు కల్పించే రక్షణ ఇదేనా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందీశ్వరి?’ అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేసింది.

Similar News

News October 20, 2025

దీపావళి: లక్ష్మీ పూజ విధానం (1/2)

image

పూజకు ముందు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. వాకిట్లో ముగ్గులు, లక్ష్మీదేవి పాద ముద్రలు గీయాలి. పూజా స్థలంలో ధాన్యంపై తెల్లని వస్త్రం పరచి లక్ష్మీదేవి ప్రతిమను ఉంచాలి. గణపతి వందనంతో పూజ ప్రారంభించి, ఆ తర్వాత శ్రీ సూక్తం పఠిస్తూ లక్ష్మీదేవిని ఆహ్వానించాలి. తులసి, గంగాజలంతో అభిషేకం చేసి, పసుపు, కుంకుమ, చందనంతో అమ్మవారిని అలంకరించాలి. ఈ ప్రక్రియ శుభశక్తులను ఆహ్వానించి, పూజకు మంచి పునాదిని ఏర్పరుస్తుంది.

News October 20, 2025

గొర్రెల్లో ప్రమాదం.. బొబ్బ రోగం(అమ్మతల్లి)

image

బొబ్బరోగం ఏ కాలంలోనైనా, ఏ ప్రాంతాల్లో గొర్రెలకైనా సోకే అంటువ్యాధి. ఇది సోకిన గొర్రెలు ఆకస్మికంగా నీరసంగా మారతాయి. శరీర ఉష్ణోగ్రత పెరిగి కళ్లు ఎర్రబడి నీరు కారతాయి. వ్యాధి సోకిన 1,2 రోజుల్లో గొర్రె శరీర భాగాలపై దద్దుర్లు ఏర్పడి క్రమేణా పెద్దవై, బొబ్బలుగా మారి చీము పట్టి నలుపు రంగులోకి మారతాయి. వ్యాధి తీవ్రత బట్టి సుమారు 20-30% గొర్రెలు మరణిస్తాయి. ఈ లక్షణాలను గుర్తించిన వెంటనే చికిత్స అందించాలి.

News October 20, 2025

దీపావళి: లక్ష్మీ పూజ విధానం (2/2)

image

అమ్మవారికి ఇష్టమైన ఎర్ర మందారం, తామర, గులాబీ వంటి పుష్పాలతో పూజ చేయాలి. పాయసం, లడ్డూ వంటి తీపి నైవేద్యాలను సమర్పించాలి. కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తూ తులసీ దళాలతో ప్రత్యేక పూజ చేయాలి. నూనె, నెయ్యి దీపాలు వెలిగించి, కర్పూర హారతి ఇవ్వాలి. పూజ ముగిశాక, కుటుంబమంతా కలిసి ఇంట్లోని ప్రతి మూలలో దీపాలు వెలిగించి, లక్ష్మీ కథలు పారాయణం చేయాలి. ఈ సంప్రదాయం సంపద, శాంతిని ఇంట్లో స్థిరంగా ఉండేలా చేస్తుంది.