News August 18, 2025
విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఈయనేనా?

NDA ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా CP రాధాకృష్ణన్ ఎంపికవ్వగా విపక్ష INDI కూటమి అభ్యర్థి ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే తమిళనాడుకే చెందిన DMK MP తిరుచ్చి శివను ప్రకటించే అవకాశముందని జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. 2026 TN అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 2 కూటములు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ చీఫ్ ఖర్గే నివాసంలో జరిగే ప్రతిపక్షాల భేటీలో అభ్యర్థి ఎవరో తేలనుంది.
Similar News
News August 18, 2025
నేషనల్ అవార్డ్స్ విజేతలకు సీఎం సన్మానం

TG: భారతీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా HYDను నిలపాలని CM రేవంత్ అన్నారు. సినిమా రంగానికి అవసరమైన చేయూతనందిస్తామని తెలిపారు. 71వ జాతీయ ఫిల్మ్ అవార్డులకు ఎంపికైన సినీ ప్రముఖులు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను CM దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం దర్శకులు అనిల్ రావిపూడి, ప్రశాంత్ వర్మ, సాయి రాజేశ్ తదితరులను CM సన్మానించారు.
News August 18, 2025
హార్ట్‌ఎటాక్‌ను 12ఏళ్ల ముందే గుర్తించొచ్చు!

గుండెపోటు సంభవించడానికి పుష్కరం ముందే కొన్ని సంకేతాలు వస్తాయని అమెరికా హార్ట్ అసోసియేషన్ పేర్కొంది. ఏటా ఓపిక తగ్గుతూ ఉంటే మీ గుండె ఆరోగ్యం క్షీణిస్తోందని అర్థం. ‘5KMPH వేగంతో నడవటానికీ ఇబ్బందిపడటం. చిన్న పనులు, వ్యాయామం చేసినా త్వరగా అలసిపోవడం, ఊపిరి ఆడకపోవడం’ వంటి లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకండి. వేగంగా నడవడం, పరిగెత్తడం, ఈత కొట్టడం, సైకిల్ తొక్కడం చేస్తే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
News August 18, 2025
రేపు స్కూళ్లకు సెలవు ఉందా?

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రేపు వాయుగుండంగా మారుతుందని APSDMA హెచ్చరించింది. దీని ప్రభావంతో APలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అయితే ఇవాళ పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ఇవ్వగా, రేపు కూడా ఇవ్వాలా? లేదా? అనేది పరిస్థితిని బట్టి చెబుతామని మంత్రి <<17441655>>సంధ్యారాణి<<>> తెలిపారు. కానీ ఇప్పటివరకు అలాంటి ప్రకటనేది రాకపోవడంతో రేపు స్కూళ్లు యథావిధిగా నడిచే అవకాశముంది.